Share News

YS Vijayamma: అమ్మకు బర్త్‌ డే విషెష్ చెప్పిన షర్మిలమ్మ

ABN , Publish Date - Apr 19 , 2024 | 03:23 PM

వైయస్ విజయమ్మకు ఆమె కుమార్తె, ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాకు జన్మనిచ్చి.. ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు అమ్మ... నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనః శాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ.. హ్యాపీ బర్త్‌డే మా అంటూ ఎక్స్ వేదికగా వైయస్ షర్మిల కన్నతల్లికి బర్త్‌డే విషెష్ చెప్పారు.

YS Vijayamma: అమ్మకు బర్త్‌ డే విషెష్ చెప్పిన షర్మిలమ్మ
YS Vijayamma, YS Sahrmila

వైయస్ విజయమ్మకు ఆమె కుమార్తె, ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నాకు జన్మనిచ్చి.. ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు అమ్మ... నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనః శాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ.. హ్యాపీ బర్త్‌డే మా’’ అంటూ ఎక్స్ వేదికగా షర్మిల భావోద్వేగ పోస్ట్‌తో బర్త్‌డే విశెష్ చెప్పారు.

అయితే ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల న్యాయ యాత్ర చేస్తూ.. బిజీ షెడ్యూల్‌ ఉండి కూడా కన్నతల్లికి బర్త్ డే విషెష్ చెప్పారు. కానీ వైసీసీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రం తన కన్నతల్లికి బర్త్ డే విషెష్ చెప్పారా? లేదా? అనేది మాత్రం తెలియరాలేదు.

మరోవైపు సరిగ్గా ఎన్నికలు సమయంలో వైయస్ విజయమ్మ యూఎస్‌లోని వైయస్ షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి వద్దకు వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకే రాష్ట్రంలో అంటే... ఆంధ్రప్రదేశ్‌ వేదికగా అటు కుమారుడు వైయస్ జగన్, ఇటు కమార్తె వైయస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

AP Elections: నిజంగా నిరుపేద.. బుట్టా


ఆ క్రమంలో తన ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కన్నతల్లి వైయస్ విజయమ్మపై సీఎం వైయస్ జగన్ తీవ్ర ఒత్తిడి చేశారని తెలుస్తుంది. అందుకు ఆమె అయిష్టత చూపడమే కాకుండా... కుమార్తె వైయస్ షర్మిలకు మద్దతుగా ప్రచారం చేస్తానంటూ వైయస్ జగన్‌కు విజయమ్మ స్పష్టం చేసినట్లు సమాచారం. ఎందుకంటే.. తన భర్త, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది కాంగ్రెస్ పార్టీ. ఆయన తుది శ్వాస వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. మళ్లీ ఆయన కుమార్తె వైయస్ షర్మిల.. ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా పోయింది. మళ్లీ ఆ పార్టీతోనే రాష్ట్రంలోనే కాదు.. కుమార్తె రాజకీయ జివితంలో సైతం కొత్త కళ వస్తుందని విజయమ్మ ఆశించారని.. అందుకే తన నిర్ణయాన్ని కుమారుడికి వివరించినట్లు తెలుస్తోంది. కానీ వైయస్ విజయమ్మ నిర్ణయాన్ని వైయస్ జగన్‌ నిర్ధ్వందంగా తొసి పుచ్చారని సమాచారం. ఇక చేసేది లేక వైయస్ విజయమ్మ అయిష్టంగా యూఎస్ ఫ్లైట్ ఎక్కేశారనే ప్రచారం నడుస్తుంది.

Hyderabad: నా భార్య నన్ను కొడుతోంది.. ప్లీజ్ విడాకులిప్పించండి..!

Updated Date - Apr 19 , 2024 | 03:59 PM