Share News

AP Elections: నిజంగా నిరుపేద.. బుట్టా

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:17 PM

వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్.. తన ఎన్నికల ప్రచారం సభల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఈ యుద్దమంటూ.. ఈ ఎన్నికలను అభివర్ణిస్తున్నారు. ఆ క్రమంలో ఇటీవల మేము సిద్దం సభల్లో పలువురు అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ.. నిరుపేదలంటూ ఆయనే సభలో స్వయంగా ప్రకటించారు.

AP Elections: నిజంగా నిరుపేద.. బుట్టా
Butta Renuka

కర్నూలు, ఏప్రిల్ 19: వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్.. తన ఎన్నికల ప్రచారం సభల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఈ యుద్దమంటూ.. ఈ ఎన్నికలను అభివర్ణిస్తున్నారు. ఆ క్రమంలో ఇటీవల మేము సిద్దం సభల్లో పలువురు అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ.. నిరుపేదలంటూ ఆయనే సభలో స్వయంగా ప్రకటించారు. అలా ప్రకటించిన జాబితాలో ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక సైతం ఉన్నారు. అయితే పార్టీ అధినేత వైయస్ జగన్ ప్రకటించినట్లు బుట్టా రేణుక నిజంగా నిరుపేదరాలనే ఓ చర్చ అయితే కర్నూలు జిల్లాలో నడుస్తుంది.

Chandrababu: నేడు కుప్పంలో చంద్రబాబు నామినేషన్..

ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె తాజాగా ఆస్తుల విలువను పొందు పరిచారు. దీంతో బుట్టా వెనుక ఉన్న కోట్లాది రూపాయిల ఆస్తులు బహిర్గతం కావడంతో జిల్లా ప్రజల్లో ఓ చర్చ అయితే వాడి వేడిగా హల్ చల్ చేస్తుంది. ఈ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం... రేణుక, ఆమె భర్త శివనీలకంఠ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.161.21 కోట్లు, అందులో చరాస్తులు రూ. 142.46 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ. 18.75 కోట్లు ఉన్నాయి. ఇక అప్పులు 7.82 కోట్లు మేర ఉన్నట్లు అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. అయితే 2014లో వీరి ఆస్తులు రూ.242.60 కోట్లు మేర ఉన్నాయి.


ఇక బుట్టా రేణుక దంపతుల ఆధ్వర్యంలో ఆటోమొబైల్స్, హోటళ్లు, విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. హోండా, టాటా మోటర్స్ వాహనాల డీలర్‌షిప్ కూడా ఉన్నాయి. అలాగే బుట్టా కన్వెన్షన్ హాల్ సైతం ఉంది. అలాగే హైదరాబాద్, మాదాపూర్, ఇజ్జత్ నగర్‌లలో ప్లాట్లు, భవనాలను సైతం ఆమె కలిగి ఉన్నారు. 2,375 గ్రాముల బంగారం, వజ్రాల హారాలు, విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలు ఆమె సొంతం. వీటి విలువే జస్ట్ రూ.2.54 కోట్లు ఉన్నాయి.

ఇక ఆమె భర్త 435 గ్రాముల బంగారు నగలు మాత్రమే కలిగి ఉన్నారు. మరోవైపు ఈ బుట్టా దంపతులకు దాదాపు వందల కోట్ల విలువ చేసే విలువైన షేర్లు సైతం ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇంకోవైపు ఐటీ నిబంధనలు సైతం ఆమె ఉల్లంఘించారని సమాచారం. దీంతో హైదరాబాద్‌లోని ఆర్దిక నేరాల న్యాయస్థానంలో మూడు కేసులు, కర్నూలులో ఒక కేసు ఆమెపై నమోదై ఉన్నాయి.

AP Elections: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తరపున భార్య ముమ్మర ప్రచారం


అయితే వైసీపీలో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ నుంచి ఆ పార్టీలోని చాలా మంది నాయకాగణం ఇలా నిరుపేదలుగా ఉన్నారని సదరు జిల్లాలో వైరల్ అవుతోంది. ఇక అధినేత వైయస్ జగన్ సైతం అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలు శిక్ష అనుభవించారని.. కానీ ఆయన సైతం తనకు ఏమీలేవని వివిధ వేదికల మీద నుంచి బల్లగుద్ది మరి చెబుతారని జిల్లా ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తుండడం గమనార్హం. ఇక ఇన్ని ఆస్తులు ఉన్న బుట్టా రేణుక 2014 ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగి.. విజయం సాధించారు.

ఆ కొద్ది రోజులకే బుట్టా దంపతులు టీడీపీలో చేరుతున్నట్లు ఓ ప్రచారం జరిగింది. అయితే ఆమె భర్త శివ నీలకంఠ పసుపు కండువా సైతం కప్పేసుకున్నారు. కానీ అంతలో ఏమైందో ఏమో కానీ.. బుట్టా మాత్రం సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత అంటే.. 2019 ఎన్నికల ముందు బుట్టా.. మళ్లీ వైసీపీ గూటికి చేరారు. ఆ క్రమంలో ఎమ్మిగనూరులో వైసీపీ తరఫున ఆమె ప్రచారం నిర్వహించారు. కానీ పార్టీ అధినేత వైయస్ జగన్.. బుట్టాకు టికెట్ కేటాయించ లేదు. ఇక 2024 ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా పేరును ఆ పార్టీ అధినేత ఖరారు చేసి.. టికెట్ కేటాయించారు.

Minister Roja: నగరిలో రోజా నామినేషనా.. మజాకా? 250 కేసుల మద్యం డంప్..

ఎమ్మిగనూరులో బుట్టా సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో.. ఆమెను ఈ నియోజకవర్గం టికెట్ కేటాయించారనే ఓ చర్చ సైతం జిల్లాలో నడుస్తుంది. ఏదీ ఏమైనా బుట్టా రేణుకాకు కోట్లాది రూపాయిల స్థిర, చరాస్తులు ఉన్నా.. ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ మార్గంలోనే నిరుపేదాల నడుమ నిరుపేదరాలుగా వైసీపీలో పయనిస్తుందనే చర్చ జిల్లాలో వైరల్ అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 19 , 2024 | 01:37 PM