AP Politics జగన్ చేసిన అతిపెద్ద తప్పు అదే.. ఉండవల్లి సంచలనం

ABN , First Publish Date - 2024-09-02T13:27:32+05:30 IST

గత ప్రభుత్వ తప్పిదాలను ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావించారు. అధికారులపై కేసులు పెట్టే అంశంపై జగన్ తప్పు చేశారని గుర్తుచేశారు. ఆ తప్పును చంద్రబాబు చేయకూడదని కోరారు. చంద్రబాబును జైలులో పెట్టి జగన్ పెద్ద తప్పు చేశారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు.

AP Politics జగన్ చేసిన అతిపెద్ద తప్పు అదే.. ఉండవల్లి సంచలనం
Undavalli Arun Kumar

రాజమండ్రి: వర్షాలతో తెలుగు రాష్ట్రాలు చిగురటాకులా వణుకుతున్నాయి. తెలంగాణలో వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. ఏపీలో గ్యాప్ ఇవ్వకుండా దంచి కొడుతోంది. సహాయక చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది. సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో జరుగుతోన్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక పనులను మంత్రి నారా లోకేశ్ మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ, ఎవరికీ సాయం చేయాలని సందేశం వస్తే చాలు అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు తీస్తోంది. వర్షాల గురించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) మీడియాతో మాట్లాడారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించారు.


jagan.jpg


ఐపీఎస్‌లు మాట వినరు..

‘ఎన్నికల అఫిడవిట్‌లో చంద్రబాబు రూ.900 కోట్ల ఆస్తులను చూపించారు. చంద్రబాబు చట్టం ప్రకారం నడుచుకునే వ్యక్తి. మార్గదర్శిపై మాత్రం అభిమానం చూపారు. కేసు విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం నడుచుకోవాలి. ఈ నెల 11వ తేదీన మార్గదర్శి కేసు వియంలో ఉన్న వాయిదాలో ఏపీ సర్కార్ అఫిడవిట్ వేయాలని భావిస్తోన్నా. కక్షసాధింపు చర్యల వల్ల అధికారుల తీరు మారనుంది. భవిష్యత్‌లో సీఎంల మాటను ఐపీఎస్ అధికారులు వినే అవకాశం లేదు అని’ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయ పడ్డారు.


Chandrababu.jpg


ఆ తప్పు వల్లే..

గత ప్రభుత్వ తప్పిదాలను ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావించారు. అధికారులపై కేసులు పెట్టే అంశంపై జగన్ తప్పు చేశారని గుర్తుచేశారు. ఆ తప్పును చంద్రబాబు చేయకూడదని కోరారు. చంద్రబాబును జైలులో పెట్టి జగన్ పెద్ద తప్పు చేశారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగేందుకు అది ఒక కారణమై ఉంటుందని అభిప్రాయ పడ్డారు.

ఇది కూడా చదవండి.

సీఎం చంద్రబాబు వెళ్లొచ్చినా అధికారుల్లో రాని మార్పు

Updated Date - 2024-09-02T13:34:10+05:30 IST