Share News

Yanamala Ramakrishnudu: జగన్ ఆర్థిక అరాచకత్వం హద్దులు దాటింది

ABN , Publish Date - Feb 07 , 2024 | 10:20 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్ తన అసమర్థ, అస్తవ్యస్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు వల్లించారని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. జగన్ ప్రభుత్వ ఆర్ధిక అరాచకత్వం హద్దులు దాటందన్నారు.

Yanamala Ramakrishnudu: జగన్ ఆర్థిక అరాచకత్వం హద్దులు దాటింది

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ తన అసమర్థ, అస్తవ్యస్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు వల్లించారని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. జగన్ ప్రభుత్వ ఆర్ధిక అరాచకత్వం హద్దులు దాటందన్నారు. ఏపీ ఆర్ధిక పరిస్థితిపై బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సైతం అవాక్కైందన్నారు. అప్పులపై వివరణ కోరినా ప్రభుత్వం స్పందించలేదని కాగ్‌ తేల్చిందని యనమల అన్నారు.

ఆదాయం కంటే చేస్తున్న అప్పులే అధికంగా ఉన్నాయని కాగ్ పేర్కొందన్నారు. ప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ తీరు అద్వానంగా ఉందని కాగ్ ఎండగట్టిందని యనమల తెలిపారు. ఆస్తులు సృష్టించకుండా రెవెన్యూ ఖర్చులకు వినియోగిస్తున్నారని కాగ్ తప్పుపట్టింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. రహస్య అప్పులతో ప్రమాదమని హెచ్చరించినా లెక్కచేయలేదన్నారు. లక్షల రూపాయల అప్పులు తెచ్చి ఖర్చు చేసినా సకాలంలో బిల్లులు రాక.. అప్పులు తీర్చలేక సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ హయాంలోని 4 శాతం ద్రవ్య లోటు నుంచి 9.6 శాతానికి పెరగడం జగన్ సాధించిన ఘనత అని పేర్కొన్నారు. జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రం 3 దశాబ్దాలు వెనక్కి వెళ్లిందని జగన్ తెలిపారు.

Updated Date - Feb 07 , 2024 | 10:20 AM