Share News

Modi: ప్రధాని మోదీ లేపాక్షి ఆలయాన్ని ఎందుకు సందర్శించారు?..అయోధ్యకు దీనికి లింకుందా?

ABN , Publish Date - Jan 16 , 2024 | 04:55 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల దక్షిణ భారత పర్యటనలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేరుకుని లేపాక్షిలోని వీరభద్ర దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అయితే అసలు మోదీ లేపాక్షిలోని వీరభద్ర ఆలయంలో ఎందుకు పూజలు నిర్వహించారు. ఈ ఆలయానికి రామాయణానికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

Modi: ప్రధాని మోదీ లేపాక్షి ఆలయాన్ని ఎందుకు సందర్శించారు?..అయోధ్యకు దీనికి లింకుందా?

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల దక్షిణ భారత పర్యటనలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేరుకుని లేపాక్షిలోని వీరభద్ర దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెలుగులో ఉన్న రంగనాథ రామాయణంలోని పద్యాలను కూడా ప్రధాని మోదీ విన్నారు. అయితే అసలు మోదీ లేపాక్షిలోని వీరభద్ర ఆలయంలో ఎందుకు పూజలు నిర్వహించారు. ఈ ఆలయానికి రామాయణానికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

నిజానికి ఈ ప్రదేశం ప్రాముఖ్యత గల రామాయణ కాలం నాటిది. రావణుడు సీతాదేవిని అపహరిస్తున్నప్పుడు, జటాయు పక్షి అతనితో జరిగిన పోరాటంలో గాయపడి ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు. ఆ క్రమంలో మరణిస్తున్న జటాయువు సీత గురించి రాముడికి సమాచారం ఇస్తుంది. ఆ క్రమంలో సీతను రావణుడు దక్షిణం వైపు తీసుకువెళ్లాడని జటాయువు రాముడికి చెప్పగా.. మరణిస్తున్న రాముడిచే జటాయువు పక్షి మోక్షాన్ని పొందినట్లు చెబుతుంటారు. ఆ క్రమంలోనే ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరు వచ్చిందని అంటుంటారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Chandrababu Live Updates: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. బిగ్ ట్విస్ట్!

విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. లేపాక్షి ఆలయ ముఖ ద్వారంలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు ఈ ఆలయంలో గాలిలో వేలాడే స్తంభం వచ్చే భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే అది అలా ఎందుకు ఉందనే ఆధారం లేనప్పటికీ మొత్తం మంటపానికి ఇదే ఆధారమని తెలిసింది. ఈ క్రమంలో ఆలయానికి ఈ స్తంభాన్ని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు.

ఇక సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ప్రధాని మోదీ రేపు కేరళలో పర్యటించనున్నారు. కేరళలోని గురువాయూర్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో ప్రధాని మోదీ ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల రంగానికి సంబంధించిన ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. నాసిక్‌లోని శ్రీ కళా రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించిన తర్వాత లేపాక్షి పర్యటన జరిగింది. కొద్ది రోజుల క్రితం నాసిక్‌లోని గోదావరి నది ఒడ్డున ఉన్న పంచవటిని ప్రధాని మోదీ సందర్శించారు.

Updated Date - Jan 16 , 2024 | 05:07 PM