Share News

Road Accident: దెందులూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

ABN , Publish Date - Feb 17 , 2024 | 10:11 AM

దెందులూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్లకోట నుంచి వరంగల్ వెళుతున్న కారు.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. వీరేంద్ర అనే వ్యక్తి భార్య, కూతురితో కలిసి ప్రయాణిస్తున్నాడు.

Road Accident: దెందులూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

ఏలూరు: దెందులూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్లకోట నుంచి వరంగల్ వెళుతున్న కారు.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. వీరేంద్ర అనే వ్యక్తి భార్య, కూతురితో కలిసి ప్రయాణిస్తున్నాడు. కారును వీరేంద్రే డ్రైవ్ చేస్తున్నాడు. అయితే అతను నిద్ర మత్తులో ఉన్నాడో లేదంటే మంచు కారణంగా కనిపించలేదో కానీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఏలూరు ఆశ్రమం ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

Updated Date - Feb 17 , 2024 | 10:50 AM