Share News

Lokesh: జగన్‌కు ‘రాజధాని ఫైల్స్’ వద్దు కానీ ‘యాత్ర-2’ కావాలంటా..!:

ABN , Publish Date - Feb 16 , 2024 | 02:00 PM

విజయనగరం జిల్లా: మరో ఐదేళ్లు ఏపీకి హైదరాబాద్ రాజధానిగా ఉండాలని వైసీపీ నేతలు కోరుతున్నారని... అంటే ఏపీకి రాజధాని కట్టలేరని తేలిపోయిందని, ఉన్న రాజధాని చెడగొట్టారని.. ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా కావాలని కోరుతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. బిల్డప్ బాబాయ్ జగన్‌కు ‘యాత్ర-2 ’ సినిమా కావాలి కానీ ‘రాజధాని ఫైల్స్’ వద్దంటా...! యాత్ర 2 సినిమా ఇప్పటికే వైసీపీ అంతిమ యాత్రగా మారిందని లోకేష్ అన్నారు.

Lokesh: జగన్‌కు ‘రాజధాని ఫైల్స్’ వద్దు కానీ ‘యాత్ర-2’ కావాలంటా..!:

విజయనగరం జిల్లా: మరో ఐదేళ్లు ఏపీకి హైదరాబాద్ రాజధానిగా ఉండాలని వైసీపీ నేతలు కోరుతున్నారని... అంటే ఏపీకి రాజధాని కట్టలేరని తేలిపోయిందని, ఉన్న రాజధాని చెడగొట్టారని.. ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా కావాలని కోరుతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. శుక్రవారం విజయనగరం జిల్లా, నెల్లిమర్లలో శంఖారావం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిల్డప్ బాబాయ్ జగన్‌కు ‘యాత్ర-2 ’ సినిమా కావాలి కానీ ‘రాజధాని ఫైల్స్’ వద్దంటా...! యాత్ర 2 సినిమా ఇప్పటికే వైసీపీ అంతిమ యాత్రగా మారిందన్నారు.

రాజధాని ఫైల్స్ సినిమా ఆడుతున్న అన్ని థియేటర్ల వద్దకు సీఎం జగన్ పోలీసులను పంపించి లాక్ చేయమని చెప్పారట.. ఎంత పిరికివాడో ఒక సారి అందరూ ఆలోచించాలని నారా లోకేష్ అన్నారు. ఈ మధ్య ముఖ్యమంత్రి ఒక్క విషయంలో నిజం చెప్పారని, తనకు స్టార్ క్యాంపైనర్స్ లేరని.. ప్రజలే తనకు స్టార్ క్యాంపైనర్లని.. ఈ ఒక్క విషయం మాత్రం నిజం చెప్పార్నారు. జగన్... సమయం తేదీ ఫిక్స్ చేయాలని వైసీపీ తెరిచిన భూం.. భూం.. షాపులకు వెళదామని, అక్కడ తాగుబోతులు సీఎం గురించి ఏం మాట్లాడుతున్నారో విందామని నారా లోకేష్ .. సీఎం జగన్‌కు సవాల్ చేశారు. తన చాలెంజ్‌ను స్వీకరిస్తారా? అంటూ సభా ముఖంగా లోకేష్ ప్రశ్నించారు. కాగా నెల్లిమర్లలో నారా లోకేష్ శంఖారావం సభకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. నెల్లిమర్ల నుంచి రామతీర్ధం వరకు రోడ్లన్నీ పసుపు మయం అయ్యాయి.

కాగా ‘రాజధాని ఫైల్స్’ సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని ఫైల్స్ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లు సక్రమంగానే ఉన్నాయని కోర్టు చెప్పింది. అయితే ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నిన్న (గురువారం) కోర్టు స్టే విధించింది. మరోసారి ఈ రోజు (శుక్రవారం) విచారణకు రాగా... సీఎం, ప్రభుత్వం ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా సినిమా ఉందని పిటిషన్ తరపున న్యాయవాది కోర్టుకు చెప్పారు. స్టేను కొనసాగించాలని కోరారు. అయితే స్టే కొనసాగించేందుకు ధర్మాసనం తిరస్కరించింది. నిరభ్యంతరంగా సినిమాను విడుదల చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - Feb 16 , 2024 | 02:00 PM