Share News

Lokesh: విజయనగరం జిల్లాలో నేడు నారా లోకేష్ శంఖారావం సభలు

ABN , Publish Date - Feb 16 , 2024 | 07:12 AM

విజయనగరం: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లిమర్లలో ఉదయం 10:15 నుంచి 11:30 గంటల వరకు సభలు నిర్వహిస్తారు.

Lokesh: విజయనగరం జిల్లాలో నేడు నారా లోకేష్ శంఖారావం సభలు

విజయనగరం: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లిమర్లలో ఉదయం 10:15 నుంచి 11:30 గంటల వరకు సభలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం విజయనగరంలో 2:15 నుండి 3:30 గంటల వరకు; గజపతినగరంలో 4:45 నుండి 6 గంటల వరకు సభలు నిర్వహిస్తారు. రాత్రి శృంగవరపుకోటలో బస చేస్తారు.

కాగా విజయనగరంలో శుక్రవారం జరిగే శంఖా రావం సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అదితి గజపతిరాజు కోరారు. ఈ మేరకు విజయనగరం అంబేద్కర్‌ జంక్షన్‌ రోడ్డులోని భాష్యం స్కూల్‌ పక్కన గల మైదానంలో నిర్వహిస్తున్న సభ ఏర్పాట్లను నాయకులతో కలిసి అదితి గజపతిరాజు పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్‌, ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌, ఆల్తి బంగారు బాబు, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, వేచలపు శ్రీను, పి.రాజేష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

నెల్లిమర్ల: రామతీర్థంలో శుక్రవారం జరగనున్న శంఖారావం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జి కర్రోతు బంగార్రాజు, పార్టీ నాయకుడు సువ్వాడ రవిశేఖర్‌ పిలుపునిచ్చారు. సభావేదిక వద్ద గురువారం నెల్లిమర్ల మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహించారు.

గజపతినగరం: గంట్యాడలో శుక్రవారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఏ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ యువనేత లోకేశ్‌ చేపట్టనున్న శంఖారావం సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని పార్టీ రాష్ట్ర నాయకుడు పీవీవీ గోపాలరాజు పిలుపునిచ్చారు.

గజపతినగరం (గంట్యాడ): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ చేపట్టిన శంఖారావం సభను విజయవంతం చేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఏ నాయుడు, జనసేన నియోజకవర్గ సమన్వయక్త మర్రాపు సురేష్‌ కోరారు. గురువారం గంట్యాడలో కేపీఎన్‌ కళాశాల ఆవ రణలో వారు విలేకర్లతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గంట్యాడ గ్రామంలో కేపీఎన్‌ బీఈడీ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశామని చెప్పారు.

కాగా శృంగవరపుకోట/లక్కవరపుకోట:ఎల్‌.కోటమండలంలోని సోంపురం కూడలిలో శనివారం ఉదయం లోకేశ్‌ ఆధ్వర్యంలో జరిగే శంఖారావానికి పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Feb 16 , 2024 | 07:12 AM