Share News

YCP: అరకు వైసీపీలో అసమ్మతి సెగ.. స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ..

ABN , Publish Date - Jan 03 , 2024 | 02:46 PM

Andhrapradesh: అరుకు వైసీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. అరకు టికెట్‌ను స్థానికులకే కేటాయించాలంటూ అరకు వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. అరకు అసెంబ్లీ స్థానం స్థానికేతరులకు కేటాయిస్తే పార్టీ నుంచి వీడే ఆలోచనలో అరకు వైసీపీ కార్యకర్తలు, స్థానిక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

YCP: అరకు వైసీపీలో అసమ్మతి సెగ.. స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ..

అల్లూరి సీతారామరాజు జిల్లా: అరుకు వైసీపీలో (Araku YCP) అసమ్మతి సెగ రాజుకుంది. అరకు టికెట్‌ను స్థానికులకే కేటాయించాలంటూ అరకు వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. అరకు అసెంబ్లీ స్థానం స్థానికేతరులకు కేటాయిస్తే పార్టీ నుంచి వీడే ఆలోచనలో అరకు వైసీపీ కార్యకర్తలు, స్థానిక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానికులకే టికెట్ కేటాయించాలంటూ స్థానిక వైసీపీ శ్రేణులు బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద మాధవి వద్దు స్థానికులే ముద్దు అంటూ నినాదాలు చేశారు. కళ్ళకు గంతులు కట్టుకుని కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అరకు నియోజకవర్గంలోని మండల కేంద్రాలలో వైసీపీకి కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజీనామా ఆలోచనలో డుంబ్రిగూడ మండల జెడ్పీటీసీ, ఎంపీపీలు సర్పంచులు ఉన్నట్లు సమాచారం.

Updated Date - Jan 03 , 2024 | 02:46 PM