Share News

Ramesh Bidhuri: ఈనెల 22 వరకు ఆలయాల్లో స్వచ్ఛ భారత్

ABN , Publish Date - Jan 17 , 2024 | 04:08 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఈనెల 22వ తేదీ వరకు స్వచ్ఛ భారత్ ( Swachh Bharat ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెట్రోలియం నేచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ రమేష్ బిధూరి ( Ramesh Bidhuri ) తెలిపారు.

Ramesh Bidhuri: ఈనెల 22 వరకు ఆలయాల్లో స్వచ్ఛ భారత్

విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఈనెల 22వ తేదీ వరకు స్వచ్ఛ భారత్ ( Swachh Bharat ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెట్రోలియం నేచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ రమేష్ బిధూరి ( Ramesh Bidhuri ) తెలిపారు. బుధవారం సింహాచలం ( Simhachalam ) కొండపై స్వచ్ఛ భారత్ ( Swachh Bharat ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ బిధూరి మీడియాతో మాట్లాడుతూ... అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని ఈనెల 22వ తేదీన ప్రారంభిస్తారని చెప్పారు. రామ మందిరం ప్రారంభోత్సవం లోపు దేశంలో అన్ని దేవాలయాలు శుభ్రంగా ఉంచాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని అందులో భాగంగానే సింహాచలం ఆలయ పరిసర ప్రాంతాలల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన సింహాచలం దేవాలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. తనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు, మండల కార్యకర్తలు స్వచ్ఛభారత్‌లో పాల్గొన్నారని ఎంపీ రమేష్ బిధూరి తెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 04:08 PM