Share News

MLA Avanti: సింహాచలంలో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు షాక్

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:42 AM

Andhrapradesh: వైసీపీ సర్కార్ చేపట్టిన గడపగడపు మన ప్రభుత్వం కార్యక్రమంలో పలుచోట్ల ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నారు. అనేక చోట్ల ఎమ్మెల్యేలను ప్రజలు అడ్డుకుంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా ఎందుకు వచ్చారంటూ నిలదీస్తున్నారు.

MLA Avanti: సింహాచలంలో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు షాక్

విశాఖపట్నం, జనవరి 6: వైసీపీ సర్కార్ చేపట్టిన గడపగడపు మన ప్రభుత్వం కార్యక్రమంలో పలుచోట్ల ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నారు. అనేక చోట్ల ఎమ్మెల్యేలను ప్రజలు అడ్డుకుంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా ఎందుకు వచ్చారంటూ నిలదీస్తున్నారు. తాజా సింహాచలంలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు (MLA Avanti Srinivasrao) మహిళలు గట్టి షాక్ ఇచ్చారు.

శనివారం ఉదయం సింహాచంలో నిర్వహించిన గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే అవంతి పాల్గొన్నారు. అయితే గడపగడపకు కార్యక్రమంలో అవంతిని మహిళలు అడ్డుకున్నారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కరించకుండా ఎందుకు వచ్చారని ఎమ్మెల్యేను నిలదీశారు. మహిళలు అడ్డుకుని నిలదీయడంతో అవంతి శ్రీనివాస్ ఖంగుతిన్నారు. సింహాచలం విజినిగిరి పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. ఎమ్మెల్యే తీరుపట్ల మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 06 , 2024 | 11:42 AM