Share News

Anganwadi Stirke: మేము నొక్కే బటన్‌తో వైసీపీ అడ్రస్ గల్లంతే.. అంగన్వాడీల హెచ్చరిక

ABN , Publish Date - Jan 01 , 2024 | 03:15 PM

Andhrapradesh: మచిలీపట్నంలో అంగన్వాడీల సమ్మె 21వ రోజు కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం తీరుపై అంగన్వాడీ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలో ఇళ్లల్లో ఉండాల్సిన తమను జగన్ ఇలా నడి రోడ్డు మీద కూర్చోబెట్టారన్నారు.

Anganwadi Stirke: మేము నొక్కే బటన్‌తో వైసీపీ అడ్రస్ గల్లంతే.. అంగన్వాడీల హెచ్చరిక

కృష్ణా, జనవరి1: మచిలీపట్నంలో అంగన్వాడీల సమ్మె 21వ రోజు కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం తీరుపై అంగన్వాడీ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలో ఇళ్లల్లో ఉండాల్సిన తమను జగన్ ఇలా నడి రోడ్డు మీద కూర్చోబెట్టారన్నారు. జగన్ ది రాతి గుండె అని అర్థమైందని.. ఆయనకు కనీసం కనికరం లేదన్నారు. లక్షా 10వేల మంది సమ్మెలో ఉంటే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఎన్నికలలో ఓట్ల కోసం హామీలు ఇచ్చింది మీరు కాదా. మీ మాటలను నమ్మి ఓట్లు వేస్తే.. ఇలా అన్యాయం చేస్తారా. ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె ఆగదు. జగన్ వేతనాలు పెంచేలా బటన్ నొక్కాలి. కాందంటే మేము మరో మూడు నెలల్లో నొక్కే బటన్‌తో వైసీపీ అడ్రస్ ఉండదు’’ అని అంగన్వాడీలు హెచ్చరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 01 , 2024 | 03:15 PM