Share News

Vallabhaneni Vamsi: యార్లగడ్డ దీక్ష వద్ద వల్లభనేని వంశీ హైడ్రామా

ABN , Publish Date - Mar 08 , 2024 | 02:07 PM

టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు నిరసన దీక్ష వద్ద వైసీపీ నేత వల్లభనేని వంశీ హై డ్రామాకు తెరదీశారు. సీసీ టీవీ ఫుటేజ్ సాక్షిగా వంశీ కాన్వాయ్ విజువల్స్ దొరికిపోయాయి. నిన్న టీడీపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా ఎనికపాడులో యార్లగడ్డ దీక్షకు దిగారు. అక్కడకు వల్లభనేని వంశీ వచ్చారు. అయితే పోలీస్‌లతో ముందుగా మాట్లాడుకొనే వంశీ వచ్చారని టీడీపీ నేతలు చెబుతున్నారు

Vallabhaneni Vamsi: యార్లగడ్డ దీక్ష వద్ద వల్లభనేని వంశీ హైడ్రామా

విజయవాడ: టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkat Rao) నిరసన దీక్ష వద్ద వైసీపీ నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) హై డ్రామాకు తెరదీశారు. సీసీ టీవీ ఫుటేజ్ సాక్షిగా వంశీ కాన్వాయ్ విజువల్స్ దొరికిపోయాయి. నిన్న టీడీపీ (TDP) కార్యకర్తలపై దాడులకు నిరసనగా ఎనికపాడులో యార్లగడ్డ దీక్షకు దిగారు. అక్కడకు వల్లభనేని వంశీ వచ్చారు. అయితే పోలీస్‌లతో ముందుగా మాట్లాడుకొనే వంశీ వచ్చారని టీడీపీ నేతలు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో వంశీ కి ఎస్కార్ట్‌గా పోలీసులు వచ్చిన దృశ్యాలు కనిపించాయి. నిరసన దీక్ష వద్దకు ముందుగానే వచ్చి డీమార్ట్ వద్ద పోలీసులు వేచి ఉన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వంశీ డీమార్ట్‌లో షాపింగ్ కోసం వచ్చారని నిన్న పోలీసులు కవర్ చేశారు.

Panchumarthi Anuradha: ఆ సమయంలో భువనేశ్వరమ్మ బాగా ఆందోళనకు గురయ్యారు

ఈ రోజు సీసీటీవీ ఫుటేజ్‌ను టీడీపీ నేతలు సేకరించారు. పోలీస్ ఎస్కార్ట్ కల్పించి మరి వంశీని తీసుకొచ్చినట్టు స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. ప్రతిపక్షాల దీక్ష వద్దకు వంశీని ఎలా తీసుకు వస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కావాలని రెచ్చగొట్టి కేసులు పెట్టేందుకే వంశీ వచ్చారని టీడీపీ నేతలు చెబుతున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా స్థానిక పోలీస్ అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. సీసీటీవీ ఫుటేజ్‌ను టీడీపీ నేతలు మీడియాకి విడుదల చేశారు. స్థానిక పోలీస్ అధికారులపై యార్లగడ్డ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారాన్ని వదిలి పెట్టేదిలేదని చెబుతున్నారు.

YS Viveka: వైఎస్ ఫ్యామిలీలో ఊహించని పరిణామం.. రాజకీయాల్లోకి వివేకా ఫ్యామిలీ!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2024 | 02:07 PM