Share News

Tirumala : ‘శ్రీవాణి’ టికెట్ల కోసం గంటల కొద్దీ నిరీక్షణ

ABN , Publish Date - Dec 25 , 2024 | 05:10 AM

ఇక్కడ క్యూలైన్లలో వేచి ఉన్న వారు సర్వదర్శన భక్తులనుకుంటే పొరపాటే. రూ.10,500 చెల్లించి శ్రీవాణి టికెట్లు పొందిందుకు వీరంతా ఇలా క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు.

Tirumala : ‘శ్రీవాణి’ టికెట్ల కోసం గంటల కొద్దీ నిరీక్షణ

Tirumala : ఇక్కడ క్యూలైన్లలో వేచి ఉన్న వారు సర్వదర్శన భక్తులనుకుంటే పొరపాటే. రూ.10,500 చెల్లించి శ్రీవాణి టికెట్లు పొందిందుకు వీరంతా ఇలా క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. తిరుమలలో కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్లర్లో ఉదయం 8 గంటలకు టికెట్ల జారీ ప్రక్రియ మొదలవుతుంది. టికెట్ల కోసం భక్తులు వేకువజాము 4 గంటల నుంచే క్యూలైన్లోకి వస్తున్నారు. మంగళవారం కూడా కౌంటర్‌ నుంచి ఏటీసీ సర్కిల్‌ వరకు క్యూలైన్‌లో భక్తులు బారులుతీరి కనిపించారు. కనీసం కూర్చునేందుకు వసతులు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

30 నిమిషాల్లో ‘వైకుంఠ’ కోటా పూర్తి

తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 30 నిమిషాల్లో పూర్తయింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Dec 25 , 2024 | 05:10 AM