Share News

AP News: అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామం..

ABN , Publish Date - Mar 25 , 2024 | 10:36 AM

రాజధాని అమరావతి ఉద్యమానికి ఎన్నికల సంఘం ఆదేశాలు పోలీసుల సూచనమేరకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్టు సమన్వయ కమిటీ, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. అమరావతి ఉద్యమకారులకు, మహిళలకు, రైతులకు, రైతు కూలీలకు, దళిత, మైనారిటీ జేఏసీ సభ్యులకు, లీగల్ అండ్ ఫైనాన్స్ కమిటీ సభ్యులకు, శిబిర నిర్వాహకులకు ఈ మేరకు ఐక్య కార్యాచరణ సమితి నుంచి ఆదేశాలు అందాయి.

AP News: అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామం..

అమరావతి: రాజధాని అమరావతి (Amaravathi) ఉద్యమానికి ఎన్నికల సంఘం ఆదేశాలు పోలీసుల (Police) సూచన మేరకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్టు సమన్వయ కమిటీ, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. అమరావతి ఉద్యమకారులకు, మహిళలకు, రైతులకు, రైతు కూలీలకు, దళిత, మైనారిటీ జేఏసీ (Minority JAC) సభ్యులకు, లీగల్ అండ్ ఫైనాన్స్ కమిటీ సభ్యులకు, శిబిర నిర్వాహకులకు ఈ మేరకు ఐక్య కార్యాచరణ సమితి నుంచి ఆదేశాలు అందాయి. 1560 రోజులుగా ఎన్ని అవాంతరాలు, అణచివేతలు ఎదురైనా అప్రతిహతంగా అమరావతి ఉద్యమం కొనసాగింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం ఎన్నికల (Elections) నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాలు, పోలీసు సూచనల మేరకు బహిరంగ సమిష్టి నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించారు.

CM Jagan: పులివెందులలో అమల్లోకి రాని ఎన్నికల కోడ్..

ఉద్యమకారులు కరోనా లాక్ డౌన్ (Corona Lockdown) సమయంలో నిరసన కార్యక్రమాలు కొనసాగించారా అదే విధంగా తమ తమ ఇళ్ళ వద్దే నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఐక్యకార్యాచరణ సమితి విజ్జప్తి చేసింది. తదుపరి కార్యాచరణను పరిస్థితులకు అనుగుణంగా ప్రకటిస్తామని జేఏసీ తెలిపింది. రోజులు.. వారాలు.. నెలలు.. సంవత్సరాలు.. కాలగమనంలో కరిగిపోతున్నాయి.. కానీ అన్యాయంపై అమరావతి అన్నదాతలు సాగిస్తున్న సమరం అజరామరంగా సాగుతూనే ఉంది. కరోనాలు, లాక్‌డౌన్‌లు, తుఫానులు, విలయాలు, పోలీసుల దౌర్జన్యాలు, దాష్టీకాలు, కేసులు, అరెస్టులు, వేదింపులు, లాఠీల దెబ్బలు, తూటాల వంటి మాటలు ఇలా ఎన్ని ఆటంకాలు వచ్చినా అవిశ్రాంతంగా అమరావతి అన్నదాతలు సాగిస్తున్న పోరాటం సాగుతూనే ఉంది. 1560 రోజులుగా రాజధాని రైతులు, కూలీలు అమరావతి కోసం పోరాడుతూనే ఉన్నారు.

CM Jagan: బస్సు యాత్రకు జనాన్ని తరలించాలంటూ ఆదేశాలు.. వైసీపీ నేతలేం చెప్పారంటే..

రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు, దళిత, బహుజన బిడ్డలు ఏకమై మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని సాగిస్తూనే ఉన్నారు. పోలీసుల నిర్బంధాలు, లాఠీల కరాళ నృత్యాలు, దేహాలపై రక్తమోడుతున్న గాయాలు.. ఏవీ వారి పోరాట పటిమను దెబ్బతీయలేకపోయాయి. అందుకే ఆ మహా మహోద్యమం మరిచిపోలేని విజయాలతో ముందుకు సాగిపోతోంది. దేశ చరిత్రలో సుదీర్ఘ సమరశీల పోరాటంగా నిలిచిపోయింది. దేవతల రాజధానిగా పేరొందిన ఏపీ సరికొత్త రాజధాని అమరావతిని నాశనం చేస్తూ వైసీపీ ప్రభుత్వం.. మూడు రాజధానుల ప్రకటన చేసింది మొదలు రాజధాని రైతులు ఉద్యమానికి దిగారు. అయితే, వీరి ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు భగ్నం చేసేందుకు సర్కారు చేయని ప్రయత్నం లేదు. మహిళలు స్నానం చేసే సమయంలో డ్రోన్‌ కెమేరాలు తిప్పి.. దీనిని అడ్డుకున్న 40 మందిపై కేసులు పెట్టి 20 రోజులపాటు జైలుపాలు చేసింది ఇప్పటి వరకూ 2600 మందిపై 600కు పైగా కేసులు బనాయించారు. నాలుగేళ్లలో 250 మంది రైతులు గుండెలు పగిలి చనిపోయారు. బెదిరించడం, భయపెట్టడం, అవమానపరచడం, లేదంటే రెచ్చగొట్టడం, అదీ కాదంటే అక్రమంగా కేసులు పెట్టి జైళ్లలో కుక్కడం.. ఇలా రోజుకో రకంగా రైతులను వేధించారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు.

Narayana: ఆనాటి కష్టాలను ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్నారు..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2024 | 11:06 AM