Share News

Lokesh: ఎంతకి బరితెగించారు?.. కానిస్టేబుల్ గణేష్ మృతిపై లోకేష్ ఆగ్రహం

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:19 PM

Andhrapradesh: అన్నమయ్య జిల్లాలో ఎర్ర చందనం మాఫియా చేతిలో కానిస్టేబుల్ గణేష్ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేష్ స్పందించారు. జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగమైందని యువనేత విమర్శలు గుప్పించారు.

Lokesh: ఎంతకి బరితెగించారు?.. కానిస్టేబుల్ గణేష్ మృతిపై లోకేష్ ఆగ్రహం

అమరావతి, ఫిబ్రవరి 6: అన్నమయ్య జిల్లాలో ఎర్ర చందనం మాఫియా చేతిలో కానిస్టేబుల్ గణేష్ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేష్ (TDP Leader Nara lokesh) స్పందించారు. జగన్ (CM Jagan) పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగమైందని యువనేత విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి, అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ప్లానింగ్‌తో వైసీపీ పార్టీ రెడ్ శాండిల్ మాఫియా అవతారం ఎత్తిందని వ్యాఖ్యలు చేశారు. ఎర్రచందనం స్మగ్లర్లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన జగన్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్‌కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారన్నారు. అడ్డొచ్చిన పోలీసులను వైసీపీ రెడ్ శాండిల్ మాఫియా చంపేస్తుందన్నారు.

అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై మెరుపుదాడులకు పాల్పడి కానిస్టేబుల్ గణేష్‌ను చంపేయ‌టం రాష్ట్రంలో వైసీపీ రెడ్‌శాండిల్ మాఫియా దారుణాల‌కు ప‌రాకాష్ట అని మండిపడ్డారు. టాస్క్ ఫోర్స్ పోలీసు వాహ‌నాల‌నే ఢీకొట్టి కానిస్టేబుల్‌ని చంపేశారంటే.. స‌ర్కారీ పెద్దల అండ‌దండ‌ల‌తో ఎంత‌గా బ‌రితెగించారో అర్థం చేసుకోవ‌చ్చన్నారు. విధినిర్వహణలో పాల‌కుల మాఫియాకి బ‌లైన కానిస్టేబుల్ గ‌ణేష్‌కు యువనేత నివాళులర్పించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గ‌ణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. గణేష్‌ను అత్యంత కిరాతకంగా చంపేసిన రెడ్ శాండిల్ మాఫియాని కఠినంగా శిక్షించాలని లోకేష్‌ డిమాండ్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 06 , 2024 | 04:23 PM