Share News

Budda Venkanna: ‘టీడీపీలో సంసారం చేస్తూ.. వైసీపీలో అక్రమ సంబంధం’.. కేశినేనిపై టీడీపీ నేత ఫైర్

ABN , Publish Date - Jan 30 , 2024 | 10:45 AM

Andhrapradesh: విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడి వైసీపీలో చేరాక తెలుగుదేశంపై అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలంటూ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుపైనే నాని సవాల్ విసిరారు. ఈ క్రమంలో టీడీపీపై కేశినేని నాని వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేశినేనిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Budda Venkanna: ‘టీడీపీలో సంసారం చేస్తూ.. వైసీపీలో అక్రమ సంబంధం’.. కేశినేనిపై టీడీపీ నేత ఫైర్

విజయవాడ, జనవరి 30: విజయవాడ ఎంపీ కేశినేని నాని (Vijayawada MP Kesineni Nani) టీడీపీని వీడి వైసీపీలో (YCP) చేరాక తెలుగుదేశంపై అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలంటూ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుపైనే (TDP Chief Chandrababu) నాని సవాల్ విసిరారు. ఈ క్రమంలో టీడీపీపై కేశినేని నాని వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేశినేనిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Budda Venkanna) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ.. వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పని చేసిందే లేదన్నారు. వైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి నడిచారన్నారు. ఎప్పటి నుంచో ఈ కోవర్టు రాజకీయాలకు నాని తెర లేపారని ఆరోపించారు.

చంద్రబాబు దగ్గర మాట్లాడిన మాటలను విజయసాయిరెడ్డి (Vijayasai Reddy), అయోధ్యరామిరెడ్డికి (Ayodhyaramireddy) చేరవేశారన్నారు. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి కేశినేని నాని అని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఇంఛార్జిగా తనను చంద్రబాబు నియమించినట్లు చెప్పారు. దుర్గగుడి ఫ్లైఓవర్ కోసం తాను ఎన్నో పోరాటాలు చేశానని తెలిపారు. తర్వాత నాని పార్లమెంట్ ఇంచార్జిగా అయ్యాక... తనను తొలగించాలని అధిష్టానానికి చెప్పారన్నారు. ఇటువంటి కుట్రలు చేస్తూ.. పార్టీలో నేతల మధ్య చిచ్చు పెట్టారన్నారు. వెధవన్నర వెధవ నాని అయితే.. ఇంకో వెధవ వల్లభనేని వంశీ అని విరుచుకుపడ్డారు. ప్రజల కోసం పోరాడే తనలాంటి వ్యక్తులపై చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారన్నారు. దీనికి ప్రత్యక్ష సాక్షి సుజనా చౌదరి (Sujana Chowdari) అని.. ఆయనకు అన్నీ తెలుసన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారన్నారు. చంద్రబాబు తనపై నమ్మకంతో.. వారి మాటలను నమ్మలేదన్నారు. కేశినేని నాని... టిక్కెట్ తీసుకోక ముందే చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసిన వెధవ అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేష్‌ను (TDP Leader Nara Lokesh) వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి తిట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు.


ఇక్కడ ఉన్నావు కాబట్టే భరించాం.. ఇకపై అలా కాదు..

‘‘ఒరేయ్ కుక్క... నీ స్థాయి ఏంటి.. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకుని మాట్లాడు. నాకు ఎటువంటి పరిధిలు లేవు.. నేను చంద్రబాబుకు హనుమతుండిలాంటి వాడిని. కొడాలి నాని సంగతి తేల్చిన వాడిని నేను.. నువ్వు ఎంతరా.. నాకు బచ్చావి. టీడీపీ జెండా కింద ఉన్నావు కాబట్టి ఇంత కాలం చాలా భరించాం. చంద్రబాబును పోటీ చేయాలని సవాల్ చేస్తావా.. ఆయన దయతో రెండుసార్లు ఎంపీ అయ్యావు. నువ్వు కానీ, నీ కూతురు కానీ పశ్చిమ నియోజకవర్గంలో నేను టీడీపీ, మీరు వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేయండి తేల్చుకుందాం. మూడు లక్షల ఓట్ల మెజారిటీతో ఈసారి నాని ఓడిపోతున్నాడు. నోరు ఉంది కదా అని పిచ్చిపిచ్చిగా వాగితే.. తగిన బుద్ది చెబుతాం. టీడీపీని ఖాళీ చేస్తాం అన్న వాడివి.. ఆరుగురిని కూడా తీసుకెళ్లలేకపోయావు. నిన్ను నమ్మి ఎవరైనా టీడీపీని వీడి వైసీపీలోకి వస్తారా. దేవినేని నెహ్రూని విమర్శించిన కేశినేని నాని.. ఇప్పుడు దేవినేని అవినాష్‌కు అనుచరుడిగా మారిపోయాడు. కేశినేని నానికి మతిభ్రమించి, పిచ్చి పట్టి వాగుతున్నాడు. కేశినేని భవన్‌కు టీడీపీ నుంచి కొంతమందైనా వెళ్లేవారు. ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయి.. ఒక్కడే కూర్చుంటున్నాడు. ఒంటరి అయిపోయి.. పిచ్చి ముదిరి.. నాని పిచ్చిపట్టినట్లుగా కూస్తున్నాడు. మానసిక వైద్య నిపుణులకు నానిని చూపించాలని ఆయన కుటుంబ సభ్యులను కోరుతున్నా’’ అంటూ బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 30 , 2024 | 10:45 AM