Share News

AP news: పోలవరం సీటుపై ఎడతెగని సస్పెన్స్ !

ABN , Publish Date - Mar 14 , 2024 | 02:21 PM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 14 స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఇప్పటికే టీడీపీ రెండు విడతల జాబితాలు ప్రకటించింది. అయితే పోలవరం విషయంలో ఎడతెగని సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ స్థానం అభ్యర్థి నిర్ణయం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. టీడీపీ తరపున బొరగం శ్రీనివాసులు ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు ఈ సీటును కేటాయించవచ్చుననే ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరి పొత్తులో భాగంగా ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠను రేపుతోంది

 AP news: పోలవరం సీటుపై ఎడతెగని సస్పెన్స్ !

అమరావతి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 14 స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఇప్పటికే టీడీపీ రెండు విడతల జాబితాలు ప్రకటించింది. అయితే పోలవరం విషయంలో ఎడతెగని సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ స్థానం అభ్యర్థి నిర్ణయం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. టీడీపీ తరపున బొరగం శ్రీనివాసులు ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు ఈ సీటును కేటాయించవచ్చుననే ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరి పొత్తులో భాగంగా ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠను రేపుతోంది.

కాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 3 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలను మాదిగ సామాజిక వర్గానికి టీడీపీ కేటాయించింది. గతంలో చింతలపూడి స్థానానికి సొంగా రోషన్ కుమార్ పేరును టీడీపీ ప్రకటించింది. తాజాగా గోపాలపురం స్థానానికి మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు స్థానానికి ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది.

ఇవి కూడా చదవండి

TDP Second List: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే

TDP Second List: టీడీపీ రెండో జాబితాలోని ప్రత్యేకతలు ఇవే...

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2024 | 02:28 PM