Share News

AP News: మీడియా యాజమాన్యాలు ఆ పని చేయొద్దు.. శ్రీనివాసరెడ్డి వార్నింగ్

ABN , Publish Date - Mar 24 , 2024 | 06:39 PM

ప్రభుత్వాలు మీడియా, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు చేస్తే న్యాయ పోరాటం చేయొచ్చని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి(Srinivas Reddy ) అన్నారు. ఆదివారం నాడు APUWJ ఆధ్వర్యంలో ‘‘సార్వత్రిక ఎన్నికలు - మీడియా పాత్ర’’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరెడ్డి, ఎం.సీ దాస్, ఐ.వి. సుబ్బారావు, చందూజనార్ధన్, సోమసుందర్, ఆలపాటి సురేష్ హాజరయ్యారు.

AP News: మీడియా యాజమాన్యాలు ఆ పని చేయొద్దు.. శ్రీనివాసరెడ్డి వార్నింగ్

విజయవాడ: ప్రభుత్వాలు మీడియా, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు చేస్తే న్యాయ పోరాటం చేయొచ్చని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి(Srinivas Reddy ) అన్నారు. ఆదివారం నాడు APUWJ ఆధ్వర్యంలో ‘‘సార్వత్రిక ఎన్నికలు - మీడియా పాత్ర’’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరెడ్డి, ఎం.సీ దాస్, ఐ.వి. సుబ్బారావు, చందూజనార్ధన్, సోమసుందర్, ఆలపాటి సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల వ్యవస్థలో డబ్బే ప్రధానంగా పని చేస్తుందని అన్నారు.గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా డబ్బులు, కానుకలు తీసుకుని కొంతమంది ఓట్లు వేస్తున్నారని చెప్పారు. చదువుకున్న వారే ఇలా చేస్తే.. ఇక సమాజం ఎలా మారుతుందని ప్రశ్నించారు. కొంతమంది టీచర్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఎన్నికల సమయంలో డబ్బులతో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి అంశాలను మీడియా కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మీడియా యాజమాన్యాలు కూడా ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నానని చెప్పారు. ప్రకటనలు, సర్క్యూలేషన్ పెంచుకునేందుకు వార్తలను తొక్కేయడం సరికాదని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఏర్పాటు చేసి జర్నలిస్టుల సమస్యలను చెప్పుకునే వేదికను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రింట్ మీడియాకు ఉన్న చట్టాలు కూడా ఎలక్ట్రానిక్ మీడియాకు లేవని తెలిపారు. పరువు తీసేలా వార్తలు రాస్తే.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ చేసి చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల వ్యవస్థ భ్రష్టుపట్టిపోతుంటే.. పత్రికలు, మీడియానే ప్రశ్నించాలని కోరారు. అభ్యర్థులు ప్రతిరోజూ చేసే ఖర్చును పూర్తిగా లెక్కించాలన్నారు. ఎన్నికల నిబంధనలు ఒకేలా ఉంటాయి.. కానీ ఎన్నికలయ్యే సరికి కోట్లు చేతులు మారే పరిస్థితి ఉందని చెప్పారు. వందల కోట్లు ఖర్చు పెట్టే అభ్యర్థుల వివరాలు, నియోజకవర్గాల గురించి నిర్భయంగా రాయాలని సూచించారు. నిజంగా ప్రజాసేవ చేయాలంటే కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారం చేయాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. ప్రజాసేవా కన్నా.. వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార దుర్వినియోగం కోసమే కోట్లు ఖర్చు పెట్టి ఆయా ఎన్నికల్లో గెలుస్తున్నారని చెప్పారు. ఇలాంటి వ్యవస్థలు మారాలని.. డబ్బు తీసుకుని ఓట్లు వేసే ప్రజల ఆలోచన మారితేనే సమాజం మారుతుందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 06:56 PM