Share News

Tammineni Seetharam: జవాబుదారీగా వ్యవహరించా...

ABN , Publish Date - Feb 08 , 2024 | 03:47 PM

Andhrapradesh: ఉత్తరాంధ్ర నుంచి శాస‌న‌స‌భ‌కు స్పీక‌ర్‌గా శ్రీకాకుళం నుంచి నాలుగవ వ్యక్తిగా ఎన్నికై పనిచేసే అదృష్టం దక్కిందని స్పీకర్ తమ్మినేని సీతాారాం అన్నారు. ఏపీ అసెంబ్లీ ముగింపు సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ... ప్రతీసారి నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించానన్నారు.

Tammineni Seetharam: జవాబుదారీగా వ్యవహరించా...

అమరావతి, ఫిబ్రవరి 8: ఉత్తరాంధ్ర నుంచి శాస‌న‌స‌భ‌కు స్పీక‌ర్‌గా శ్రీకాకుళం నుంచి నాలుగవ వ్యక్తిగా ఎన్నికై పనిచేసే అదృష్టం దక్కిందని స్పీకర్ తమ్మినేని సీతారాం (AP Assembly Speaker Tammineni Seetharam) అన్నారు. ఏపీ అసెంబ్లీ ముగింపు సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ... ప్రతీసారి నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించానన్నారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇచ్చానని.. సభకు జవాబుదారీగా వ్యవహరించినట్లు చెప్పారు. స‌భాప‌తిగా ఉన్న స‌మ‌యంలో అనేక కీల‌క బిల్లులు ఆమోదం పొందాయన్నారు.

విప‌క్ష స‌భ్యుల అనుచిత ప్రవర్తనకు బాధితునిగా మారానన్నారు. ప్రతిపక్ష సభ్యులు విమర్శలను ఓపికగా భరించినట్లు చెప్పారు. విప‌క్ష స‌భ్యులు ప్రవర్తన తనను బాధించిందన్నారు. విధులు నిర్వర్తించడంలో తనను ఇబ్బందిపెట్టారన్నారు. విప‌క్షాలు త‌మ ప్రవర్తనతో శాస‌న‌స‌భ స్ధాయిని త‌గ్గించారన్నారు. స‌భ గౌర‌వ మ‌ర్యాద‌లు కాపాడేలా ప్రతీఒక్కరూ ప్రవర్తించాలని స్పీకర్ తమ్మినేని సీతారం సూచించారు.


స్పీకర్ తడబాటు...

శాసనసభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. అయితే శాసనసభలో పార్టీ సభ్యుల లెక్కను చెప్పేటప్పుడు స్పీకర్ తడబడటం గమనార్హం. సభలో తనకు ఎదురైన అనుభవాలను చెబుతూ సభ్యుల సంఖ్యను స్పీకర్ తప్పుగా పలికారు. వైసీపీ సభ్యుల సంఖ్యను 151గా పేర్కొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం.. టీడీపీ సభ్యుల సంఖ్యను తప్పుగా చెప్పారు. టీడీపీ సభ్యుల సంఖ్యను కేవలం 2గా చెప్పారు. జనసేన ఒకటి, ఖాళీగా ఉన్న స్థానాల సంఖ్యను ఒకటిగా పేర్కొన్న స్పీకర్ మొత్తం సభ్యులగా సంఖ్యను 175గా తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 08 , 2024 | 03:56 PM