Ratnachal Express: రత్నచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ వేళల్లో మార్పు
ABN , Publish Date - Dec 31 , 2024 | 09:45 PM
విజయవాడ నుంచి ప్రతి రోజు ఉదయం రత్నచల్ ఎక్స్‌ప్రెస్ Ratnachal Express: రైలు విశాఖపట్నం బయలుదేరి వెళ్తుంది. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6.15 గంటలకు ఈ రైలు విశాఖపట్నం బయలుదేరుతోంది. అయితే..

విజయవాడ, డిసెంబర్ 31: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లు బయలుదేరు వేళల్లో మార్పులు - చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే 2025, జనవరి 1వ తేదీ నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. రైల్వే సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు, అలాగే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. గతంలో ప్రతి రోజు ఉదయం 6.15 నిమిషాలకు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నంకు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరేది.
కానీ రేపటి నుంచి అంటే.. 2025, జనవరి 1వ తేదీ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6.00 గంటలకు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతోంది. అంటే పావు గంట ముందుగా విజయవాడ నుంచి ఈ ఎక్స్ ప్రెస్ రైలు విశాఖపట్నంకు బయలుదేరనుంది. నిత్యం విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుంటారన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మార్పును గమనించాలని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
జనవరి 1 నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణ వేళల్లోనూ మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నగర వ్యాప్తంగా 88 ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని వివరించింది. ప్రయాణికుల సౌకర్యార్థం, కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను అనుసంధానం చేసేందుకు వీలుగా ఈ మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇక రైళ్లు మార్పుల వేళలు.. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్‌లో చూసుకోవచ్చని ప్రయాణికులకు సూచించింది.
Also Read: న్యూ ఇయర్ వేళ.. మద్యం షాపు యజమానులకు గుడ్ న్యూస్
Also Read: సిట్ సభ్యులపై విమర్శలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: సారీ చెప్పిన సీఎం..ఎందుకంటే..
Also Read: గురుశరణ్ కౌర్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
Also Read: మీ బ్యాగు తగిలించుకొన్న తీరే.. మీరేమిటో చెబుతోంది
Also Read: రహదారిపై ఆగిన కారు.. రంగంలోకి ఎద్దులు
For AndhraPradesh News And Telugu News