Share News

AP News: పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్‌‌కు సముద్రం పోటు

ABN , Publish Date - Apr 16 , 2024 | 08:24 AM

పిఠాపురం నియోజకవర్గం కొమరగిరిలో 365 ఎకరాల పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్‌ సముద్రం పోటుకు గురవుతోంది. లేఅవుట్ కు అతి సమీపంగా సముద్రం నీరు వచ్చేసింది. పోటు అధికంగా ఉండడంతో ఇళ్లు కట్టుకున్న పేదలు ఆందోళన చెందుతున్నారు. స్థలాలు, ఇళ్లకు ఉప్పు నీటి ముప్పు పొంచి ఉండడంతో కలవరం చెందుతున్నారు. ఏ క్షణాన ఏమవుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు.

AP News: పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్‌‌కు సముద్రం పోటు

కాకినాడ: పిఠాపురం నియోజకవర్గం కొమరగిరిలో 365 ఎకరాల పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్‌ సముద్రం పోటుకు గురవుతోంది. లేఅవుట్ కు అతి సమీపంగా సముద్రం నీరు వచ్చేసింది. పోటు అధికంగా ఉండడంతో ఇళ్లు కట్టుకున్న పేదలు ఆందోళన చెందుతున్నారు. స్థలాలు, ఇళ్లకు ఉప్పు నీటి ముప్పు పొంచి ఉండడంతో కలవరం చెందుతున్నారు. ఏ క్షణాన ఏమవుతుందోనని తెలియని పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.

అబద్ధాలు.. మోసాలు.. గులకరాయితో డ్రామాలు జగన్‌రెడ్డీ.. ఎన్నాళ్లీ నాటకాలు?


2020 డిసెంబర్‌లో కోమరగిరి నుంచే రాష్ట్ర వ్యాప్త ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని సీఎం జగన్ (CM Jagan) ప్రారంభించారు. సముద్రం పోటు భయంతో 13,500 ఇళ్లకు ఇప్పటి వరకూ 800 గృహాలే పూర్తయ్యాయి. సముద్రం ముప్పు ఉందని తెలిసినా కూడా ప్రభుత్వం ఇక్కడే స్థలాలు సేకరించింది. కాకినాడ సిటీకి చాలా దూరంగా ఉండడంతో పాటు సముద్రం పోటునకు కూడా గురవుతుండటంతో ఈ లే అవుట్‌కు రావడానికి పేదలు అనాసక్తి చూపుతున్నారు.

CM Jagan: భీమవరంలో జగన్ సిద్ధం సభ.. జనం కోసం నేతలు ఆపసోపాలు

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 16 , 2024 | 08:24 AM