Share News

Raghurama: పోటీ ఖాయం... ఎలా అన్నదే తేలాలి

ABN , Publish Date - Apr 12 , 2024 | 09:10 AM

‘ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం ఖాయం. అసెంబ్లీనా, పార్లమెంటా అనేది తేలాలి’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఆయన కలిశారు.

Raghurama: పోటీ ఖాయం... ఎలా అన్నదే తేలాలి

● పవన్‌ కల్యాణ్‌ను కలసిన ఎంపీ రఘురామరాజు

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 11: ‘ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం ఖాయం. అసెంబ్లీనా, పార్లమెంటా అనేది తేలాలి’ అని రఘురామకృష్ణరాజు (Raghuramakrishna Raju) పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఆయన కలిశారు. ఇప్పటి వరకూ ఆయనకు ఏ పార్టీ నుంచి టికెట్‌ దక్కలేదు. అయినా సరే పవన్‌ కల్యాణ్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ, పోటీ తప్పకుండా చేస్తానని పేర్కొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 09:10 AM