Share News

Balineni: జగన్ - సజ్జలపై బాలినేని ఫైర్

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:40 PM

ప్రకాశం జిల్లా: ఒంగోలు లోక్ సభ ఇన్చార్జ్‌గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకంపై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. నిన్న చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలు ఇచ్చేది లేదని బాలినేనికి చెప్పిన వైసీపీ పెద్దలు.. 24 గంటలు గడవకముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు.

Balineni: జగన్ - సజ్జలపై బాలినేని ఫైర్

ప్రకాశం జిల్లా: ఒంగోలు లోక్ సభ ఇన్చార్జ్‌గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకంపై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. నిన్న చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలు ఇచ్చేది లేదని బాలినేనికి చెప్పిన వైసీపీ పెద్దలు.. 24 గంటలు గడవకముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు. సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి తీరుపై భగ్గుమన్న మాజీ మంత్రి బాలినేని సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అనుచరుల ఫోన్లకు అందకుండా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.

కాగా వైసీపీ అధిష్టానం బాలినేని శ్రీనివాసుల రెడ్డికి షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించడంతోపాటు ఒంగోలు పార్లమెంట్ స్థానంలో పోటీ చేసే అవకాశం ఇస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన సంకేతాలను బాలినేనికి వైసీపీ పెద్దలు ఇచ్చారు. అయితే ఒంగోలు నుంచి చెవిరెడ్డి పోటీని అంగీకరించనని స్పష్టం చేస్తూ.. విజయవాడలో వైసీపీ అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టారు. దీంతో చెవిరెడ్డి ఒంగోలులో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామని, పార్టీ బాధ్యతలు అప్పగించమని చెప్పి బాలినేనిని బుజ్జగించారు. నిన్న ఒంగోలు చేరుకున్న బాలినేని.. ఇక్కడ పార్లమెంట్ స్థానంలో ఎవరు పోటీ చేస్తే నాకేంటి? తన పని తాను చూసుకుంటానని మీడియాతో అన్నారు. సాయంత్రానికే చెవిరెడ్డిని ఒంగోలు పార్లామెంట్ ఇన్చార్జ్‌గా నియమిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఈ నేసథ్యంలో తనకు చెప్పిందొకటి.. చేసిందొకటి అంటూ బాలినేని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.

Updated Date - Feb 01 , 2024 | 12:40 PM