Share News

AP Politics: రాజకీయాల్లో కొనసాగలేను.. గల్లా జయదేవ్ కీలక ప్రకటన

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:47 AM

రాజకీయాలు తనను మార్చలేవని, వీలయితే రాజకీయాలను తాను మారుస్తానని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. నిజాయతీ గల వారు రాజకీయాల్లోకి వచ్చిన మౌనంగా ఉండటం తప్పం ఏం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.

AP Politics: రాజకీయాల్లో కొనసాగలేను.. గల్లా జయదేవ్ కీలక ప్రకటన

గుంటూరు: రాజకీయాలు తనను మార్చలేవని, వీలయితే రాజకీయాలను తాను మారుస్తానని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ (Galla Jayadev) అభిప్రాయపడ్డారు. నిజాయతీ గల వారు రాజకీయాల్లోకి వచ్చిన మౌనంగా ఉండటం తప్పం ఏం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. రాజకీయాలకు వీడ్కోలు చెప్పేందుకు గుంటూరులో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. తరలి వచ్చిన అనుచరులను ఉద్దేశించి గల్లా జయదేవ్ మాట్లాడారు. ఆ సమయంలో ఉద్వేగానికి గురయ్యారు. ఆయన ఏం మాట్లాడారంటే..?

గల్లా జయదేవ్ కామెంట్స్

2024 ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నా. రాజకీయాల్లో ఉంటే నా పని చేయలేకపోతున్నా. కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బంది అని మౌనంగా ఉండలేను, అందుకోసమే రాజకీయాల్లో ఉండొద్దని నిర్ణయం తీసుకున్నాను. రాజకీయాల్లో ఉంటే సమస్యలు వస్తున్నాయి. ఒకవేళ గుంటూరు నుంచి పోటీ చేసినా గెలుస్తా, పార్లమెంటులో మౌనంగా కూర్చొవడం నా వల్ల కాదు. ఇకపై పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగలేను. రాజకీయం, వ్యాపారం రెండు చోట్ల ఉండలేని పరిస్థితి. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని’ గల్లా జయదేవ్ స్పష్టంచేశారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల విస్తరణకు ఇబ్బందులు కలిగాయి. దాంతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నెలకొల్పాం. విదేశాల్లో పరిశ్రమలను విస్తరిస్తున్నాం. రాజకీయాల్లో నుంచి వైగొలిగే పరిస్థితి వస్తుందని అనుకోలేదు. రాజకీయం, వ్యాపారం రెండు చేయొచ్చని భావించాను. ప్రస్తుత పరిస్థితుల్లో రెంండింటికి న్యాయం చేయలేను. రాజకీయాలు వదిలేస్తే రావటం కష్టమే. కానీ నన్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేశాయి. అయినప్పటికీ తట్టుకుని నిలబడ్టాను. అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..ఈ సారి పార్ట్ టైం రాజకీయ నాయకుడిగా మాత్రమే వస్తాను. శ్రీరాముడు వనవాసం విడిచి వట్టునట్టుగా దృఢంగా వస్తా. ఎంపీలకు ప్రత్యేక అధికారాలు లేవు. రూ.5 కోట్ల ఎంపీ నిధులు ఇస్తారు. ప్రాంతీయ పార్టీలలో పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాలి. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో మాట్లాడాను. దాంతో ఈడీ అధికారులు నన్ను పిలిచి బెదిరించారు. అయినా నేను భయపడలేదు. నేను చేసిన పనులను గుర్తించి 2019లో ప్రజలు రెండోసారి ఎంపీగా గెలిపించారు. అప్పుడు కూడా ప్రతిపక్ష ఎంపీగా మాట్లాడాను. అమరావతి రైతులతో ఛలో అసెంబ్లీ నిర్వహించాను. పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అమరావతి పేరును దేశ చిత్ర పటంలో పెట్టేలా చేశాను.

తన కంపెనీలు అన్నీ చట్ట పరంగా నిర్వహిస్తున్నాం. వ్యాపారం చేయాలంటే ప్రభుత్వ సహకారం తప్పనిసరి. 70 ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విభాగాలను ఆయుధాలుగా మార్చి నాపై ప్రయోగించారు. న్యాయపరంగా ముందుకు వెళ్లాం. కోర్టులో గెలుస్తామనే నమ్మకం ఉంది. పోరాటంలో గెలిచినా యుద్ధంలో ఓడిన పరిస్థితి ఏర్పడింది అని’ గల్లా జయదేవ్ అనుచరులతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 28 , 2024 | 12:31 PM