Share News

Janasena: పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ నామినేషన్ ఎప్పుడంటే?

ABN , Publish Date - Apr 18 , 2024 | 10:03 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆస్థానానికి గానూ పవన్ ఏప్రిల్ 23న నామినేషన్(Nomination) సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

Janasena: పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ నామినేషన్ ఎప్పుడంటే?

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆస్థానానికి గానూ పవన్ ఏప్రిల్ 23న నామినేషన్(Nomination) సమర్పించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి మంగళవారం పవన్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు.


దూకుడు పెంచనున్న పవన్..

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ పవన్ తన ప్రచారంలో వేగం పెంచుతున్నారు. ఏప్రిల్ 20 నుంచి ఆయన వరుసగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రోజుకి కనీసం రెండు సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు రచించారు.

టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సైతం ఆయన ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కలిసి ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నారు.


పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్(ఏప్రిల్ లో)

20న పిఠాపురం, రాజానగరం బహిరంగ సభ

21న భీమవరం, నరసాపురం

22న తాడేపల్లెగూడెం, ఉంగుటూరు

23న పిఠాపురంలో నామినేషన్, ఉప్పాడలో బహిరంగ సభ

24న చంద్రబాబుతో కలిసి రాజంపేట, రైల్వే కోడూరు బహిరంగ సభలు

25న టీడీపీ సభ

26న రాజోల్, రామచంద్రాపురం

27న పెద్దాపురం, కాకినాడ రూరల్

28న జగ్గంపేట, పత్తిపాడు

29న తిరుపతి

30న పోలవరం


పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్(మే నెలలో)

మే 1న ఎలమంచిలి, పెందుర్తి

2న విశాఖపట్నం సౌత్

3న పాలకొండ, నెల్లిమర్ల

4న తుని, పిఠాపురం

5న గుడివాడ , పామర్రు

6న రేపల్లె, అవనిగడ్డ

7న గన్నవరం, పెనమలూరు

8, 9 తేదీలలో సమావేశాలు ఖరారు కావాల్సి ఉంది

10న పిఠాపురం లో రోడ్ షో, సభ

11న కాకినాడ అర్బన్ రోడ్ షో, మీటింగ్

AP Election 2024:పెద్దిరెడ్డి రెండు సార్లు నా కాళ్లు పట్టుకున్నారు.. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హాట్ కామెంట్స్

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 10:03 PM