Share News

Janasena: వైసీపీ మరోసారి వస్తే రాష్ట్రం అంధకారమే.. స్పష్టం చేసిన పవన్

ABN , Publish Date - Feb 20 , 2024 | 09:58 PM

వైసీపీ మరోసారి గెలిస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేశారు. ప్రతిపక్ష ఓటు చీలి వైసీపీకి లబ్ధి జరగకూడదనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు వివరించారు.

Janasena: వైసీపీ మరోసారి వస్తే రాష్ట్రం అంధకారమే..  స్పష్టం చేసిన పవన్

అమరావతి: వైసీపీ మరోసారి గెలిస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేశారు. ప్రతిపక్ష ఓటు చీలి వైసీపీకి లబ్ధి జరగకూడదనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు వివరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. "తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది రాష్ట్రానికి చాలా అవసరం. పొత్తులో భాగంగా జనసేనకు దక్కే స్థానాల్లో మన భాగస్వామ్య పార్టీ ఓట్లు పక్కాగా దక్కించుకోవాలి. భాగస్వామ్య పార్టీ పోటీ చేసిన చోట మన ఓటు బదిలీ అయ్యేలా చూసుకోవడం కీలకం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మన పార్టీకి ఓట్లు బాగా పోలయ్యాయి. ఈ స్థానం నుంచి జనసేన రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అక్కడి నుంచి తెలుగుదేశం వరుసగా గెలిచింది అని చెబుతున్నారు. ఆ పార్టీ నాయకులతో మాట్లాడదాం.

కందుల దుర్గేష్‌ను వదులుకోం. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే 40 స్థానాల్లో గెలుస్తుంది. కానీ జగన్‌ని ఎదుర్కోవడానికి ఎలక్షన్ ఇంజినీరింగ్ కీలకం. మనకు రావాల్సిన ప్రతి ఓటునూ పోలింగ్ బూత్ వరకూ తీసుకువెళ్లి.. మన గుర్తు మీద పడేలా చేయాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వైసీపీకి లబ్ధి జరుగుతుంది. ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది" అని పవన్ అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2024 | 09:59 PM