Share News

AP HighCourt: లుక్ ఔట్ సర్య్కూలర్‌పై హైకోర్టులో ఎన్‌ఆర్‌ఐ యాష్ సవాల్.. విచారణ వాయిదా

ABN , Publish Date - Jan 04 , 2024 | 04:01 PM

Andhrapradesh: తనపై జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్‌ను ఎన్ఆర్‌ఐ, టీడీపీ నేత యాష్ బొద్దులూరు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరిగింది. యాష్ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు.

AP HighCourt: లుక్ ఔట్ సర్య్కూలర్‌పై హైకోర్టులో ఎన్‌ఆర్‌ఐ యాష్ సవాల్.. విచారణ వాయిదా

అమరావతి: తనపై జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్‌ను ఎన్ఆర్‌ఐ, టీడీపీ నేత యాష్ బొద్దులూరు (NRI Yash) హైకోర్టులో (AP HighCourt) సవాల్ చేశారు. దీనిపై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరిగింది. యాష్ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఇప్పటికే సీఐడీ అధికారులు యాష్‌కు 41A క్రింద నోటీసులు జారీ చేశారని కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ నోటీసులపై యాష్ ఈ నెల 11న విచారణకు హాజరు అవుతున్నారని న్యాయవాది చెప్పారు. అందువలన సీఐడీ జారీ చేసిన ఎల్‌వోసీని రద్దు చేయాలని ఉమేష్ చంద్ర కోరారు. ఎల్‌వోసీ వలన యాష్ విదేశాలకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయిందన్నారు. ఈ పిటీషన్‌పై వెంటనే విచారణ జరుపాలని న్యాయవాది కోరారు. ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని సీఐడీ న్యాయవాదిని హైకోర్టు ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 04 , 2024 | 04:01 PM