Share News

AP Elections 2024: ఎన్నికల ముందే నీరుకారిపోయిన వంశీ

ABN , Publish Date - Apr 25 , 2024 | 08:00 PM

ఇది వరకు ఎవరిని ఏదైనా మాట అంటే.. కొండను తిరిగి వచ్చి అన్నవారికి తగిలేవి. కానీ ప్రస్తుతం అలా లేదు. నేడు ఎవరిని ఏదైనా అంటే.. నీళ్ల కుండను తిరిగి వచ్చినంత ఈజీగా అన్నవారికి వచ్చి తగులుతుంది. అందుకు అత్యుత్తమ ఉదాహరణ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఏప్రిల్ 25వ తేదీ నామినేషన్ ప్రక్రియకు తుది రోజు. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ వేసేందుకు గన్నవరంలో ర్యాలీ నిర్వహించారు.

AP Elections 2024:  ఎన్నికల ముందే నీరుకారిపోయిన వంశీ
Vallabhaneni Vamsi

ఇది వరకు ఎవరిని ఏదైనా మాట అంటే.. కొండను తిరిగి వచ్చి అన్నవారికి తగిలేవి. కానీ ప్రస్తుతం అలా లేదు. నేడు ఎవరిని ఏదైనా అంటే.. నీళ్ల కుండను తిరిగి వచ్చినంత ఈజీగా అన్నవారికి వచ్చి తగులుతుంది. అందుకు అత్యుత్తమ ఉదాహరణ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఏప్రిల్ 25వ తేదీ నామినేషన్ ప్రక్రియకు తుది రోజు. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ వేసేందుకు గన్నవరంలో ర్యాలీ నిర్వహించారు.

AP Assembly Elections 2024: డీజీపీని ఎన్నికల విధులకు దూరం పెట్టండి

ఈ ర్యాలీలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆ క్రమంలో ఆయన శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ర్యాలీ నిలిపివేసి.. ఓ చోట కూర్చుని అవస్థ పడ్డారు. ఇక ఓపిక లేక.. ప్రచార వాహనం ఎక్కి నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. అనంతరం ఆ కార్యాలయం వద్ద వంశీ కొంత అసౌకర్యానికి గురయ్యారు. అందులోభాగంగా ఆ కార్యాలయం బయట ఉన్న సిమెంట్ కూర్చిలో కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నిదానంగా వెళ్లిపోయారు.

Lok Sabha polls 2024: అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యర్థి ఆస్తులు ఇవే

అయితే ఇదే వల్లభనేని వంశీ.. టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అవకాశం వచ్చినప్పుడల్లా తన మాటలతో చెలరేగిపోతుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడుని ముసలోడు అంటూ అడపా దడపా అభివర్ణిస్తుంటారు. అయితే ఎన్నికల నామినేషన్ వేసే వేళ వల్లభనేని వంశీ పడిన అవస్థలు తాలుక వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Budi Mutyala Naidu: సీఎం ఫ్యామిలీలో సీన్.. డిప్యూటీ సీఎం ఫ్యామిలీలో రీపిట్

ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యంగ బాణాలు సంధిస్తున్నారు. డెబ్బై ఏళ్లు దాటినా చంద్రబాబు హుషారుగా ఎండలో తిరుగుతున్నారన్నారు. తమరు కొద్ది సేపు ఎండలో తిరిగే సరికే కళ్లు తేలేస్తున్నారని వ్యంగ్యంగా అంటున్నారు. కర్మ అనేది ఒకటి ఉంటుందని.. అది వల్లభనేని వంశీకి డబుల్ డోస్ ఇస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది శాంపిల్ మాత్రమేనని .. అసలు సినిమా ముందుందని నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా అభిప్రాయపడుతున్నారు.

Budi Mutyala Naidu: సీఎం ఫ్యామిలీలో సీన్.. డిప్యూటీ సీఎం ఫ్యామిలీలో రీపిట్

2014, 2019 ఎన్నికల్లో గన్నవరం టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో.. ఆయన ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. అనంతరం రాజకీయ జీవితాన్ని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడునే కాదు... ఆయన ఫ్యామిలీని సైతం లక్ష్యంగా చేసుకొని ఇదే వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అనంతరం టీవీ చర్చ కార్యక్రమంలో సారీ చెప్పినా.. అప్పటికే ఈ గన్నవరం ఎమ్మెల్యేకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ముచ్చటగా మూడోసారి ఎన్నికల బరిలో దిగి.. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారీ వంశీ. మరి గన్నవరం నియోజకవర్గ ప్రజలు.. వంశీని ఆదరిస్తారా? లేదా ? అనేది తెలియాలంటే మాత్రం జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందేననేది సుస్పష్టం.

Read National News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 08:41 PM