Share News

Anganawadi Strike: మమ్మల్ని రెచ్చగొడుతున్నారు.. టచ్ చేస్తే మా సత్తా చూపిస్తాం.. అంగన్వాడీల హెచ్చరిక

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:06 PM

Andhrapradesh: అంగన్వాడీ కార్మికులతో నెల్లూరు నగరం జనసంద్రంగా మారింది. బుధవారం ఏబీఎం నుంచి కలెక్టరెట్ వరకు అంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్మికులు మాట్లాడుతూ.. ఈనెల 5 లోపు విధులకు హాజరుకాకపోతే చర్యలంటే భయపడమని స్పష్టం చేశారు.

Anganawadi Strike: మమ్మల్ని రెచ్చగొడుతున్నారు.. టచ్ చేస్తే మా సత్తా చూపిస్తాం.. అంగన్వాడీల హెచ్చరిక

నెల్లూరు, జనవరి 3: అంగన్వాడీ కార్మికులతో నెల్లూరు నగరం జనసంద్రంగా మారింది. బుధవారం ఏబీఎం నుంచి కలెక్టరెట్ వరకు అంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్మికులు మాట్లాడుతూ.. ఈనెల 5 లోపు విధులకు హాజరుకాకపోతే చర్యలంటే భయపడమని స్పష్టం చేశారు. గతంలో కూడా చాలా బెదిరింపులు చూశామని.. 4 సాయంత్రంలోపు తమ డిమాండ్లు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు నోరు మెదపదం లేదని ప్రశ్నించారు.

‘‘మాది శాంతియుత పోరాటం.. మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అంగన్వాడీ కార్మికులను టచ్ చేస్తే మా సత్తా చూపిస్తాం’’ అని హెచ్చరించారు. అంగన్వాడీలకు బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి వేళ్లు అరిగిపోయాయా అని ఎద్దేవా చేశారు. ఒక్క అవకాశం ఇవ్వమన్నావు ఇచ్చామని.. ఇంక రేపు ఎన్నికల్లో బటన్ తాము నొక్కుతామన్నారు. బలవంతమైన సర్పం చలి చీమల చేత చిక్కిన సామెత ముఖ్యమంత్రి గుర్తుకు తెచ్చుకోవాలని అంగన్వాడీలు హితవుపలికారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 03 , 2024 | 12:06 PM