Share News

Nara Lokesh: శాంతి స్వరూప్ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది..

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:41 AM

తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. దూరదర్శన్ అంటే వార్తలు .. వార్తలు అంటే శాంతి స్వరూప్ అన్నంతగా తెలుగు వీక్షకులకు దగ్గరైన ఆయన మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.

Nara Lokesh: శాంతి స్వరూప్ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది..

అమరావతి: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) స్పందించారు. దూరదర్శన్ అంటే వార్తలు .. వార్తలు అంటే శాంతి స్వరూప్ అన్నంతగా తెలుగు వీక్షకులకు దగ్గరైన ఆయన మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. శాంతి స్వరూప్‌కి కన్నీటి నివాళులు అర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు. శాంతి స్వరూప్ కుటుంబసభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Raghurama Krishnaraju: ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా.. మరుక్షణమే నా ఎంపీ సీటు పోతుంది

ప్రముఖ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ (Shanti Swaroop) ఇవాళ ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండురోజుల క్రితం శాంతి స్వరూప్‌కి గుండెపోటు రాగా.. కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం యశోదా ఆస్పత్రికి తరలించారు. దురదృష్టావశాత్తు చికిత్స పొందుతూనే శాంతి స్వరూప్ ఇవాళ కన్నుమూశారు.

YS Sharmila: షర్మిల పాదయాత్రకు వైసీపీ నాయకురాలు.. మరికాసేపట్లో కాంగ్రెస్‌లోకి..

తెలుగులో తొలిసారి వార్తలు..

శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చదివారు. తెలుగు తొలి న్యూస్‌ రీడర్‌గా చెరగని ముద్ర వేశారు. అంతేకాదు.. పదేళ్లపాటు టెలీప్రాంప్టర్‌ లేకుండా పేపర్‌ చూసి చెప్పేవారు. శాంతిస్వరూప్.. 1983 నవంబర్ నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదివారు. 2011లో దూరదర్శన్‌లో పని చేసిన ఆయన.. ఆ తరువాత పదవీ విరమణ చేశారు. న్యూస్ రీడర్‌గా లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును కూడా శాంతిస్వరూప్ అందుకున్నారు.

Andhra Pradesh: వైసీపీ ముఖ్య నేతకు బీజేపీ లీడర్ సీరియస్ వార్నింగ్..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2024 | 11:41 AM