Nara Lokesh: మంత్రిగా నారా లోకేశ్.. బ్రాహ్మణి ఎమోషనల్
ABN , Publish Date - Jun 12 , 2024 | 08:24 PM
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఇతరులు ప్రమాణం చేశారు. లోకేశ్ మంత్రిగా ప్రమాణం చేయడంతో భార్య బ్రాహ్మణి ఎమోషనల్ అయ్యారు. ఆ అపురూప క్షణాలకు సంబంధించి ఫొటోలను సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఇతరులు ప్రమాణం చేశారు. లోకేశ్ మంత్రిగా ప్రమాణం చేయడంతో భార్య బ్రాహ్మణి ఎమోషనల్ అయ్యారు. ఆ అపురూప క్షణాలకు సంబంధించి ఫొటోలను సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు.
‘నిజంగా నేను గర్వ పడే క్షణాలు ఇవి. భర్త లోకేశ్ మంత్రిగా ప్రమాణం చేయడంతో ఉద్వేగానికి గురిచేసింది. ఆయన పడిన కష్టానికి ఫలితం దక్కినట్టు అయ్యింది. ప్రజలకు సేవ చేసేందుకు మంత్రిగా తన ప్రయాణం ప్రారంభించారు. మంత్రిగా ప్రమాణం చేసిన శ్రీవారికి శుభాకాంక్షలు అని’ నారా బ్రాహ్మణి రాసుకొచ్చారు. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నా అని బ్రాహ్మణి అభిప్రాయ పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల పట్ల మీకు (చంద్రబాబుకు) ఉన్న ఆరాధన, రాష్ట్రం పట్ల ఉన్న దృక్పథం స్ఫూర్తిదాయకం అని నారా బ్రాహ్మణి రాసుకొచ్చారు. ఆల్ ద బెస్ట్ అంటూ విష్ చేశారు.