Share News

AP Election 2024: చంద్రబాబు తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన నారా భువనేశ్వరి

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:15 PM

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు-2024లకు సంబంధించిన కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు, ప్రముఖలు నామినేషన్లు వేయగా తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్ కుప్పం నియోజకవర్గంలో దాఖలైంది. ఆయన తరపున సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. కుప్పంలో రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కి నామినేషన్‌ పత్రాలను ఆమె సమర్పించారు.

AP Election 2024: చంద్రబాబు తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన నారా భువనేశ్వరి

కుప్పం: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Election 2024), లోక్‌సభ ఎన్నికలు-2024లకు సంబంధించిన కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు, ప్రముఖలు నామినేషన్లు వేయగా తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) నామినేషన్ కుప్పం నియోజకవర్గంలో దాఖలైంది. ఆయన తరపున సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. కుప్పంలో రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కి నామినేషన్‌ పత్రాలను ఆమె సమర్పించారు. నామినేషన్‌కు ముందు భువనేశ్వరి సారధ్యంలో భారీ ర్యాలీ జరిగింది. పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు.


రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను అంతం చేయాలని ర్యాలీలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి నారా భువనేశ్వరి అన్నారు. అందరం కలిసి ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగన్ సారధ్యంలోని వైసీపీ ప్రభుత్వంలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పెట్టుబడులు వచ్చాయని, చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని భువనేశ్వరి అన్నారు. నేడు రాష్ట్రంలోకి పెట్టుబడులు రావడంలేదని, పైగా ఉన్నవి తరలి వెళ్తున్నాయని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను వేధించారని అన్నారు.


రాజమండ్రిలో పురందేశ్వరి నామినేషన్ దాఖలు

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. పురంధేశ్వరి నివాసం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు వీకే సింగ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, ఎన్డీయే కూటమి అభ్యర్థులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, మద్దిపాటి వెంకటరాజు, బత్తుల బలరామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అమ్మకు బర్త్‌ డే విషెష్ చెప్పిన షర్మిలమ్మ.. మరి జగన్ చెప్పారా?

నేను ప్రజల ముందుకొస్తే.. వైసీపీ నేతల్లో వణుకు పుట్టి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 19 , 2024 | 04:26 PM