Share News

NMD Farooq: టీడీపీ అభ్యర్థి ఫరూక్‌కు తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Apr 09 , 2024 | 05:09 PM

నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్‌ఎమ్‌డి ఫరూక్‌కు ప్రమాదం తృటిలో తప్పింది. నంద్యాల నుంచి కర్నూలుకు కారులో వెళ్తుండగా పాన్యం మండలం తమ్మరాజుపల్లె దగ్గర ఆయన వాహనం రోడ్డుపై ఉన్న బర్రెలను ఢీకొంది. అయితే ..

NMD Farooq: టీడీపీ అభ్యర్థి ఫరూక్‌కు తప్పిన ప్రమాదం

నంద్యాల: నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్‌ఎమ్‌డి ఫరూక్‌కు ప్రమాదం తృటిలో తప్పింది. నంద్యాల నుంచి కర్నూలుకు కారులో వెళ్తుండగా పాన్యం మండలం తమ్మరాజుపల్లె దగ్గర ఆయన వాహనం రోడ్డుపై ఉన్న బర్రెలను ఢీకొంది. అయితే ఈ ఘటనలో కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఫరూక్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఘటన స్థలానికి చేరుకున్న పాన్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డి తదితరులు.. ఫరూక్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Apr 09 , 2024 | 06:14 PM