Share News

Chandrababu: ఒకే రోజు.. 5 సభలు.. 82 పూర్తి!

ABN , Publish Date - May 09 , 2024 | 06:36 PM

ఎన్నికల పోలింగ్‌కు అట్టే సమయం లేదు. రాజకీయ పార్టీలు ప్రజల మధ్యకు వెళ్లి తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. శుక్రవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయిదు ప్రజాగళం సభల్లో పాల్గొనున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు.

Chandrababu: ఒకే రోజు.. 5 సభలు.. 82 పూర్తి!
Chandrababu Naidu

అమరావతి, మే 09: ఎన్నికల పోలింగ్‌కు అట్టే సమయం లేదు. రాజకీయ పార్టీలు ప్రజల మధ్యకు వెళ్లి తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. శుక్రవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయిదు ప్రజాగళం సభల్లో పాల్గొనున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు.

గురువారం అంటే నేటితో చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలు 82 పూర్తి చేసుకున్నాయి. ఈ రోజు ఉత్తరాంధ్రలోని చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక శనివారం ఎన్నికల ప్రచారానికి చివరి రోజు. ఈ నేపథ్యంలో ఆ రోజు చంద్రబాబు.. మూడు ప్రజాగళం సభల్లో పాల్గొనున్నారు.


ఈ ఏడాది మార్చి 27వ తేదీన ప్రజాగళం సభ ఏర్పాటుతో.. తన ఎన్నికల ప్రచారాన్ని నారా చంద్రబాబు నాయుడు పలమనేరులో ప్రారంభించిన విషయం విధితమే. అయితే ప్రచార గడువు ముగిసే నాటికి.. 90 నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు నిర్వహించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకొన్న దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.

సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో పోలింగ్ జరుగుతున్నాయి. ఆ క్రమంలో మే 13వ తేదీన నాలుగో దశ పోలింగ్‌లో జరగనుంది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సైతం జరగనుంది. ఈ నేపథ్యంలో మే 11వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ, జనసేనతో టీడీపీ జతకట్టి కూటమిగా ఏర్పడింది.


అందులోభాగంగా ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తోపాటు పవన్ కల్యాణ్‌, దగ్గుబాటి పురందేశ్వరి.. ఎవరికీ వారు తమ ప్రచారాన్ని ప్రజల మధ్యకు వెళ్లి ఉధృతం చేశారు. అలాగే తాజాగా ప్రధాని మోదీ సైతం విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు పాల్గొన్నారు.

అదే విధంగా అనకాపల్లి, రాజమండ్రి ప్రజాగళం సభల్లో సైతం ప్రధాని మోదీ పాల్గొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో గతంలో బాదుడే బాదుడు, బాబు ష్యూరిటీ.. భవిష్యత్త్‌కు గ్యారంటీ పేరిట కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Read Latest Natinal News And Telugu News

Updated Date - May 09 , 2024 | 07:47 PM