Share News

AP Politics: ఏపీ స్పీకర్‌తో జరిగిన సంభాషణ ఎమ్మెల్యే ఆనం మాటల్లో..

ABN , Publish Date - Jan 29 , 2024 | 04:31 PM

Andhrapradesh: అనర్హత పిటిషన్లపై విచారణకు హాజరుకావాలంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన లేఖకు రసీదు ఇవ్వాలని కోరగా.. ఇవ్వాల్సిన అవసరం లేదని స్పీకర్ అన్నారని తెలిపారు.

AP Politics: ఏపీ స్పీకర్‌తో జరిగిన సంభాషణ ఎమ్మెల్యే ఆనం మాటల్లో..

అమరావతి, జనవరి 29: అనర్హత పిటిషన్లపై విచారణకు హాజరుకావాలంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం (AP Speaker Tammineni Seetharam) కలిశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన లేఖకు రసీదు ఇవ్వాలని కోరగా.. ఇవ్వాల్సిన అవసరం లేదని స్పీకర్ అన్నారని తెలిపారు. న్యాయవాదుల ద్వారా విచారణకు వస్తామని చెప్పినప్పటికీ సమయం లేదని.. ఇప్పటికే మూడు సార్లు టైం ఇచ్చామని స్పీకర్ అన్నారన్నారు. న్యాయవాదిని పెట్టుకుంటామంటే అంగీకరించలేదని ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు.

జరిగింది ఇదీ అన్న ఆనం రాంనారాయణరెడ్డి

‘‘ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఫిర్యాదు ఇచ్చారని... విచారణకు రావాలని పిలిచారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం నుంచి 12:30 గంటలకు విచారణకు హాజరుకావాలని మాకు ఒక లేఖ వచ్చింది. దీనికి ముందు ఇంకో 2 లేఖలు వచ్చాయి. ప్రసాద్ రాజు ఎందుకు ఈరోజు రాలేదు. అసలు ఆ కంప్లైంట్ నిజంగా వారే ఇచ్చారా అని అడిగాం. ఆయన వివరణకు ఉదయం వచ్చారు... ఆయన ఉండాల్సిన అవసరం లేదని స్పీకర్ చెప్పారు. ఆయన కంప్లైంట్స్ ఆధారంగా మీడియా వార్తలను జిరాక్స్ కాపీల రూపంలో ఇచ్చారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాకుండా వాటిని ఎలా చూడాలి. ఆ వార్త రాసిన ఎడిటర్, రిపోర్టర్‌లు ఎవ్వరైనా ఉన్నారా అని అడిగాం. మాకు కొన్ని సీడీలు పంపారు. అందులో వీడియోలు ఓపెన్ కావడం లేదు. ఒరిజినల్ ఫీడ్ కావాలి అని అడిగాం. మాకు వారిచ్చిన డాక్యుమెంట్స్‌పై విశ్వాసం లేదు. ఒరిజినల్ ఇస్తే 4 వారాల్లో న్యాయవాదుల ద్వారా విచారణకు వస్తామని అన్నాం. అంత సమయం లేదు 3 సార్లు టైం ఇచ్చామని స్పీకర్ అన్నారు. న్యాయవాదిని పెట్టుకుంటామని అడిగితే దానికి ఆయన అంగీకరించేది లేదు అని చెప్పారు’’ ఆనం వెల్లడించారు.


స్పీకర్‌తో వాదించాం...

‘‘మేము ఒక మెమో ఇచ్చాం దానికి అక్నోలేజ్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు... ఇవ్వమని స్పీకర్ చెప్పారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని అన్నాం.. స్పీకర్‌తో వాదించాం. సెక్రటరీ జనరల్ ఉన్నారు రాజ్యసభలో సుదీర్ఘ కాలం పనిచేశారు అని చెప్పారు. ఆయనను రశీదు కోసం అడిగాం. ఆయన తల ఉపారు. ఇస్తారా ఇవ్వరా అని అడిగాం. ఇస్తాం అన్న తరువాత కూడా ఎక్కువ తొందర ఉందా అని స్పీకర్ అన్నారు. స్పీడ్ పోస్ట్‌లో పంపుతామన్నారు. గతంలో అనేక నిర్ణయాలు స్పీకర్‌లు ఇచ్చారు అవన్నీ చూడండి అని అడిగాం. నేను నిర్ణయం తీసుకున్న.. నేను తీసుకున్న నిర్ణయం రాబోయే శాసనసభలకు ప్రెసిడెన్స్ కావాలని స్పీకర్ అన్నారు. మన రూల్ బుక్‌లో 3 సార్ల కన్నా ఎక్కువ పిలవకూడదు అని లేదు కదా అని అడిగాం. అయితే ఆ రూల్ ఇప్పుడు పెట్టునున్నాం అన్నారు. మరలా విచారణకు రావాలా అని అడిగాం. స్పీకర్ మమ్మల్ని ఇక దయ చేయొచ్చు అన్నారు. మీరు మూడు వాయిదాలు మాత్రమే అంటున్నారు. నాకే లేఖ ఇచ్చారు... నా మీద మీకు నమ్మకం లేదా అని స్పీకర్ అన్నారు. అయినా మేము రసీదు పంపాలి అని.. ఆఫీస్ ప్రోసిజర్ అది అన్నాం’’ అని ఆనం రాంనారాయణరెడ్డి చెప్పుకొచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 29 , 2024 | 04:45 PM