Share News

AP News: విశాఖలో భారీగా ఈ సిగరెట్ల పట్టివేత

ABN , Publish Date - Mar 24 , 2024 | 07:04 PM

విశాఖ నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఈ సిగరెట్లను భారీగా పట్టుకున్నారు. నగరంలోని మీరా కలెక్షన్, డేజావు క్లాత్ షో రూంలో అమ్మడానికి సిద్ధంగా ఉన్న 743 ఈ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అమ్ముతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 22 లక్షల విలువైన ఈ సిగరేట్లను పట్టుకుని సీజ్ చేశారు.

AP News: విశాఖలో భారీగా ఈ సిగరెట్ల పట్టివేత

విశాఖపట్నం: విశాఖ నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఈ సిగరెట్లను భారీగా పట్టుకున్నారు. నగరంలోని మీరా కలెక్షన్, డేజావు క్లాత్ షో రూంలో అమ్మడానికి సిద్ధంగా ఉన్న 743 ఈ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అమ్ముతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 22 లక్షల విలువైన ఈ సిగరేట్లను పట్టుకుని సీజ్ చేశారు. 2019లో ఈ సిగరెట్లు బ్యాన్ చేసిన కొంతమంది అక్రమార్కలు వీటిని అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత మీడియాకు విశాఖ జాయింట్ సీపీ ఫకిరప్ప వివరాలు వెల్లడించారు. నగరంలో ఈ సిగరెట్లు అమ్ముతున్నట్లు తమకు పక్కా సమాచారం అందడంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ సిగరెట్ల విలువ 22 లక్షల రూపాయల వరకు మార్కెట్‌లో ఉంటుందని తెలిపారు.

ఈ సిగరెట్‌లలో నికోటిన్ ఉంటుందని.. ఇది మత్తు కలిగిస్తుందని చెప్పారు. ఈ కేసులో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ముంబై నుంచి ఈ సిగరెట్లు విశాఖకు వచ్చినట్టు గుర్తించామని అన్నారు. ముంబైలో ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి 2 రివాల్వర్లను తాము గుర్తించామన్నారు. శ్రీ కృష్ణ ట్రావెల్ ఆఫీస్‌లో శివ నాగరాజు అనే వ్యక్తి పని చేస్తున్నారని అన్నారు. జార్ఖండ్ నుంచి వచ్చిన వ్యక్తి బెంగళూరు‌కి బుక్ చేసుకున్నారని చెప్పారు. మద్యం మత్తులో జార్ఖండ్ నుంచి వచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడంతో.. అతన్ని శివ నాగరాజు అడగటంతో భయంతో అక్కడ నుంచి పారిపోయాడన్నారు. పారిపోతున్న క్రమంలో బ్యాగ్‌లో నుంచి రెండు తుపాకీలు పడిపోయాయని తెలిపారు. అప్పటి నుంచి శివ నాగరాజు వద్దనే గన్లు ఉంచుకున్నారన్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని విశాఖ జాయింట్ సీపీ ఫకిరప్ప తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 07:04 PM