Share News

Road Accident: కర్ణాటక: దావణగేరి వద్ద రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Feb 26 , 2024 | 08:56 AM

కర్ణాటక: దావణగేరి వద్ద సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు మిర్చి రైతులు మృతి చెందారు. పెద్దకడుబూరు మండలం, నాగలాపురంకు చెందిన మస్తాన్, పెద్ద వెంకన్న మృతి చెందారు.

Road Accident: కర్ణాటక: దావణగేరి వద్ద రోడ్డు ప్రమాదం

కర్ణాటక: దావణగేరి వద్ద సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో కర్నూలు (Kurnool) జిల్లాకు చెందిన ముగ్గురు మిర్చి రైతులు (Farmers) మృతి చెందారు. పెద్దకడుబూరు మండలం, నాగలాపురంకు చెందిన మస్తాన్, పెద్ద వెంకన్న మృతి చెందారు. అలాగే మంత్రాలయం మండలం, శింగరాజనహల్లికి చెందిన ఈరన్న మరణించాడు. మిర్చి లోడుతో టెంపోలో బ్యాడిగి మార్కెట్‌కు వెళుతుండగా టైర్ పంచరై... అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 26 , 2024 | 08:58 AM