Share News

Corona.. కర్నూలు: జిల్లాలో కరోనా విజృంభన

ABN , Publish Date - Jan 12 , 2024 | 08:06 AM

కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. అవుకు, కర్నూలు, బండిమెట్ల, ముజఫర్ నగర్‌లో ఒక్కొక్కటి, కర్నూలు మండల పరిధిలోని వెంగన్న బావి గ్రామంలో ఇద్దరు పిల్లలకు కోవిడ్ పాజిటివ్‌గా అధికారులు నిర్ధారించారు.

Corona.. కర్నూలు: జిల్లాలో కరోనా విజృంభన

కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. అవుకు, కర్నూలు, బండిమెట్ల, ముజఫర్ నగర్‌లో ఒక్కొక్కటి, కర్నూలు మండల పరిధిలోని వెంగన్న బావి గ్రామంలో ఇద్దరు పిల్లలకు కోవిడ్ పాజిటివ్‌గా అధికారులు నిర్ధారించారు. కాగా కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 23 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా విజృంభన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. సంక్రాంతి సందర్భంగా ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని హెచ్చరించారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.. ముఖ్యంగా తిరుపతిలో కేసులు పెరిగాయి. అలాగే విశాఖ, విజయవాడ, రాజమండ్రి, బాపట్ల, అనంతపురంతో పాటూ పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఏపీలో నమోదవుతున్న కేసుల్లో జేఎన్ 1 కేసులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Updated Date - Jan 12 , 2024 | 08:06 AM