Share News

Srisailam: శ్రీశైలంలో కొనసాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Mar 07 , 2024 | 06:57 AM

నంద్యాల: శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన గురువారం ఉదయం ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆది దంపతులు సాయంత్రం గజ వాహనంలో ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్నారు.

Srisailam: శ్రీశైలంలో కొనసాగుతున్న  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

నంద్యాల: శ్రీశైలం (Srisailam) క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (Mahashivratri Brahmotsavalu) వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన గురువారం ఉదయం ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆది దంపతులు సాయంత్రం గజ వాహనంలో ఆశీనులై ప్రత్యేక పూజలందుకొనున్నారు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవార్లు గజవాహనంలో గ్రామోత్సవంగా విహరించనున్నారు. బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయి.

కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం (8వ తేదీ) పాగాలంకరణ, కల్యాణోత్సవం జరగనున్న సందర్భంగా భక్తులు భారీగా తరలి రానున్నారు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు (EO Peddi Raju) తెలిపారు. 9న రథోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలు జరగనున్నాయి. 10న ధ్వజావరోహణం.. 11న అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Updated Date - Mar 07 , 2024 | 07:32 AM