Share News

Fengal Cyclone: ‘ఫెంగల్’ తుఫాన్.. ఏ క్షణమైనా

ABN , Publish Date - Nov 30 , 2024 | 09:36 AM

Andhrapradesh: తుఫాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థమేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే కొన్నిచోట్ల అతితీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను నేపథ్యంలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం తీరం వెంబడి 70-90 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచనున్నాయి.

Fengal Cyclone: ‘ఫెంగల్’ తుఫాన్.. ఏ క్షణమైనా
Weather updates

అమరావతి, నవంబర్ 30: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం నాటికి తుఫానుగా మారడంతో.. దానికి ‘‘ఫెంగల్ ’’ (Fengal Cyclone) తుఫానుగా నామకరణం చేశారు. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో తుఫాను కదులుతోంది. పశ్చిమ-వాయువ్య దిశగా ఫెంగల్ కదులుతోంది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 150 కిలోమీటర్లు, చెన్నైకి 140 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈరోజు (శనివారం) సాయంత్రానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది.

పరిశ్రమలకు కరెంట్‌ షాక్‌


తుఫాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థమేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే కొన్నిచోట్ల అతితీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను నేపథ్యంలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం తీరం వెంబడి 70-90 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచనున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్‌కు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరికలు జారీ చేశారు.

దూసుకొస్తున్న ‘ఫెంగల్‌’


దెబ్బతిన్న వరినారుమళ్లు.. స్తంభించిన చేనేత పనులు

కాగా.. బంగాళాఖాతంలో తీవ్ర వాయిగుండం నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో పెన్నానదిలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని కేంద్ర సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. సోమశిల డ్యాం భధ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సముద్రంలో గంటగంటకు అలల ఉధృతి పెరుగుతుండటంతో.. తీర ప్రాంత మత్స్యకార గ్రామాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. పలుప్రాంతాల్లో వర్షం తాకిడికి వరినారుమళ్లు దెబ్బతిన్నాయి. వారం రోజులుగా సముద్రంలో చేపల వేట నిలిచిపోగా.. చేనేత పనులు కూడా స్తంభించాయి.


తమిళనాడులో భారీ వర్షాలు...

మరోవైపు ఫెంగల్ తుఫాన్‌తో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై సహా ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. నేడు ఫెంగల్ తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో... తీరం దాటే సమయంలో 90 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచేఅవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో చెన్నై సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని పోర్టుల్లోనూ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.


ఇవి కూడా చదవండి...

అర్ధరాత్రి గందరగోళం.. వార్డెన్‌ సస్పెండ్

షాకింగ్.. మళ్లీ పంజుకున్న బంగారం, వెండి ధరలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 30 , 2024 | 09:43 AM