Share News

Anganwadi Strike: అంగన్వాడీలపై పోలీసుల దమనకాండ.. ఖాకీల దౌర్జన్యంతో పలువురికి గాయాలు

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:07 PM

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తతకు దారి తీస్తోంది. కలెక్టరేట్ల ముట్టడికి బయలుదేరిని అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులను తప్పించుకుని కలెక్టరేట్ల ముట్టడికి వెళ్లిన అంగన్వాడీలపై ఖాకీలు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు.

Anganwadi Strike: అంగన్వాడీలపై పోలీసుల దమనకాండ.. ఖాకీల దౌర్జన్యంతో పలువురికి గాయాలు

విజయవాడ: విజయవాడలో కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలపై పోలీసుల దమనకాండకు పాల్పడ్డారు. పోలీసుల దౌర్జన్యం వల్ల పలువురు అంగన్వాడీలకు తీవ్ర గాయాలయ్యాయి. అంగన్వాడీల నిరసనకు మద్దతుగా నిలిచిన సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావుతో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దౌర్జన్యంతో బాబురావుకి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం అంగన్వాడీల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తతకు దారి తీస్తోంది. కలెక్టరేట్ల ముట్టడికి బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులను తప్పించుకుని కలెక్టరేట్ల ముట్టడికి వెళ్లిన అంగన్వాడీలపై ఖాకీలు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. పలువురు అంగన్వాడీలు కళ్లు తిరిగి పడిపోయినప్పటికీ కనికరం చూపించకుండా ఈడ్చెకెళ్లే పరిస్థితి నెలకొంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 03 , 2024 | 01:08 PM