Share News

CP Rajashekhar: ఆ ఫ్రాడ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండండి.. సీపీ హెచ్చరిక

ABN , Publish Date - Dec 20 , 2024 | 04:44 PM

Andhrapradesh: ఎల్‌హెచ్ఎంఎస్ యాప్‌ను ఉపయోగించాలని.. ఈ యాప్‌తో లింక్ చేసేలా ఇళ్లకు కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీపీ రాజశేఖర్ బాబు సూచించారు. ఇటువంటి నేరాలు జరిగితే పోలీసులకు కూడా సమాచారం అందుతుందన్నారు. అపార్ట్‌మెంట్, కాలనీల్లో తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

CP Rajashekhar: ఆ ఫ్రాడ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండండి.. సీపీ హెచ్చరిక
CP Rajasekharbabu

విజయవాడ, డిసెంబర్ 20: పోలీసుల పేరుతో దోపిడీ చేసిన ముఠాను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 25 లక్షల50 వేల రూపాలయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖర్ బాబు (CP Rajasekhar babu) శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల పేరు చెప్పుకుని నలుగురు ముఠాగా ఏర్పడ్డారని.. డబ్బు లావాదేవీలు విషయం తెలుసుకుని ఫాలో అయ్యారన్నారు. మార్గ మధ్యలో వాళ్లను ఆపి పోలీసుల పేరుతో బెదిరించి దోపిడీ చేశారన్నారు. ఫిర్యాదు వచ్చిన తరువాత దర్యాప్తులో ఫేక్ పోలీసులు అని తేలిందని తెలిపారు. వాళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 25 లక్షల వరకు రికవరీ చేశామని చెప్పారు. క్రైం ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిఘా పెంచామన్నారు. తాము చేపట్టిన చర్యలు వల్ల కొంత వరకు తగ్గాయన్నారు.

TG highcourt: కేటీఆర్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ...


ఎల్‌హెచ్ఎంఎస్ యాప్‌ను ఉపయోగించాలని.. ఈ యాప్‌తో లింక్ చేసేలా ఇళ్లకు కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇటువంటి నేరాలు జరిగితే పోలీసులకు కూడా సమాచారం అందుతుందన్నారు. అపార్ట్‌మెంట్, కాలనీల్లో తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవలి కాలంలో వీటిపై ప్రత్యేకంగా డ్రైవ్‌లు కూడా నిర్వహించినట్లు సీపీ వెల్లడించారు. బైక్‌ల‌ దొంగతనాలు కూడా ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయన్నారు. వాణిజ్య సముదాయాలు, ఆయా రోడ్లలో సీసీ కెమెరాలు పెట్టాలన్నారు. 28 డ్రోన్ కెమెరాలు పొలీస్టేషన్లకు ఇచ్చామని తెలిపారు. డ్రోన్స్ పెట్రోల్ ద్వారా కూడా నేరాలను తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్నారు.


భవానీ దీక్ష విరమణ సమయంలో కూడా డ్రోన్‌లు వాడుతున్నామని తెలిపారు. డిజిటల్ అరెస్టులో 40 నుంచి 50 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లు ఎక్కువ అయ్యాయని.. వాటి పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌లో ఇరుక్కుంటే.. చాలా ఇబ్బందులు ఉంటాయన్నారు. ఊరికే డబ్బులు వస్తాయని ఎవరూ ఆశ పడవద్దన్నారు. ఎవరికీ ఊరికే డబ్బులు రావు అనేది తెలుసుకోవాలన్నారు. మీరు బకరాలు కావద్దు అని ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచారం చేస్తున్నామని సీపీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

అది చంద్రబాబుతోనే సాధ్యం: భువనేశ్వరి

చిరుతకు షాక్ ఇచ్చిన కుందేలు..

Read Latest AP News AND Telugu News

Updated Date - Dec 20 , 2024 | 04:44 PM