Share News

Ramakrishna: 12వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె... ఆందోళనలో పాల్గొన్న రామకృష్ణ

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:30 PM

Andhrapradesh: రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరింది. కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలంటూ కార్మికులు నిరసనకు దిగారు. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కోటేశ్వరరావు ఆందోళనలో పాల్గొన్నారు.

Ramakrishna: 12వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె... ఆందోళనలో పాల్గొన్న రామకృష్ణ

విజయవాడ, జనవరి 6: రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరింది. కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలంటూ కార్మికులు నిరసనకు దిగారు. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna), కోటేశ్వరరావు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. జగన్‌కు కనీసం సిగ్గూ శరం లేదని విమర్శించారు. లక్షల మంది కార్మికులు రోడ్డెక్కినా స్పందించరా అని ప్రశ్నించారు. నిర్ణయాధికారం లేని మంత్రులతో చర్చలు ఎందుకన్నారు. ఎన్నికలలో జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నారని.. ఓట్ల కోసం హామీలు ఇచ్చి గద్దెనెక్కాక మాట తప్పి మడమతిప్పి మోసం చేశారని మండిపడ్డారు.


తల్లులు చేసే పనిని మున్సిపల్ కార్మికులు చేస్తున్నారన్నారు. ఇంటి నుంచి తన తల్లినే గెంటేసిన జగన్‌‌కు ఈ మున్సిపల్ కార్మికుల కష్టం అర్థం కావటం లేదన్నారు. ఓట్లు సీట్లు లెక్కలేసుకుంటూ ఎమ్మెల్యేలను బదిలీ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారన్నారు. ఎన్ని మాయలు చేసినా వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని రామకృష్ణ స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 06 , 2024 | 02:33 PM