Share News

Kodi Pandalu: కృష్ణాజిల్లా: పామాయిల్ తోటలో కోడి పందాలు

ABN , Publish Date - Feb 11 , 2024 | 08:00 AM

కృష్టా జిల్లా: గన్నవరం మండలం, సూరంపల్లి పామాయిల్ తోటలో భారీగా కోడి పందాలు జరుగుతున్నాయి. దీంతో విశ్వాసనీయ సమాచారం మేరకు హనుమాన్ జంక్షన్, వీరవల్లి, ఆత్కూరు, గన్నవరం, నాలుగు స్టేషన్‌ల పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు.

Kodi Pandalu: కృష్ణాజిల్లా: పామాయిల్ తోటలో కోడి పందాలు

కృష్టా జిల్లా: గన్నవరం మండలం, సూరంపల్లి పామాయిల్ తోటలో భారీగా కోడి పందాలు జరుగుతున్నాయి. దీంతో విశ్వాసనీయ సమాచారం మేరకు హనుమాన్ జంక్షన్, వీరవల్లి, ఆత్కూరు, గన్నవరం, నాలుగు స్టేషన్‌ల పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. భారీ సెట్టింగ్‌లతో రహస్యంగా పామాయిల్ తోటలో నిర్వాహకులు కోడి పందాలు నిర్వహిస్తున్నారు. దాడి చేసిన పోలీసులు 40 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు, కార్లు 20, 40 బైకులు, సెల్ ఫోన్లు 40 , పందెపుకోళ్ళు 45 స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 40 మంది వ్యక్తులపై గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 11 , 2024 | 08:00 AM