Share News

CM Jagan: పార్లమెంట్‌లో ప్రధాని మోడీతో జగన్ భేటీ

ABN , Publish Date - Feb 09 , 2024 | 11:39 AM

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. శుక్రవారం పార్లమెంట్‌లో ప్రధాని మోడీతో జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా రాజకీయ అంశాలు ప్రధానితో జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

CM Jagan: పార్లమెంట్‌లో ప్రధాని మోడీతో జగన్ భేటీ

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. శుక్రవారం పార్లమెంట్‌లో ప్రధాని మోడీతో జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా రాజకీయ అంశాలు ప్రధానితో జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం నిధులు త్వరితగతిన విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంకు ఆమోదం, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్, కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని జగన్ ప్రధాని మోదీని కోరనున్నట్లు సమాచారం.

అలాగే జాతీయ ఆహార భద్రతాచట్టం ఆంధ్రప్రదేశ్‌కు మరింత ఎక్కువ కవరేజీ కింద ఏపీ కన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు సమానంగా వాటా.. ఈ వాటా లభిస్తే.. రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కే అవకాశం ఉందని, కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం చేయాలని జగన్ కోరనున్నారు. ఏపీఎండీసీ కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని, ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్ తదితర అంశాలను జగన్మోహన్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Updated Date - Feb 09 , 2024 | 11:39 AM