Share News

TDP, YCP: స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ నేడు

ABN , Publish Date - Jan 29 , 2024 | 06:48 AM

అమరావతి: స్పీకర్ కార్యాలయంలో సోమవారం అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలను ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని, అలాగే తెలుగుదేశం రెబల్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది.

TDP, YCP:  స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ నేడు

అమరావతి: స్పీకర్ కార్యాలయంలో సోమవారం అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలను ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని, అలాగే తెలుగుదేశం రెబల్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ ఆదేశాలిచ్చింది. వివరణ ఇచ్చేందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 15 నిమిషాల వరకు స్పీకర్ కార్యాలయం సమయానికి కేటాయించింది. అయితే వివరణ ఇవ్వాలా వద్దా అన్నదానిపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు. కాగా ఇప్పటికే వివరణ ఇవ్వడానికి 30 రోజులు గడువు కావాలని వైసీపీ రెబెల్స్ స్పీకరుకు లేఖ రాశారు.

Updated Date - Jan 29 , 2024 | 06:48 AM