Share News

AP Assembly: మూడవ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ABN , Publish Date - Feb 07 , 2024 | 09:50 AM

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. రైతుల సమస్యలపై చర్చించాలంటూ తెలుగుదేశం వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. దీన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించడతో...

AP Assembly: మూడవ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. రైతుల సమస్యలపై చర్చించాలంటూ తెలుగుదేశం వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. దీన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించడతో వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ నేతలు పట్టుపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వమని, క్రాప్ ఇన్సూరెన్స్‌, కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. అయితే సభలో అరవండి అంటూ.. మంత్రి కారుమూరి టీడీపీ సభ్యులను రెచ్చగొట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

Updated Date - Feb 07 , 2024 | 09:50 AM