Share News

Anganwadi Strike: కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీల పిలుపు.. ఏపీలో ఉద్రిక్తం

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:03 AM

Andhrapradesh: సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు (బుధవారం) కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని గత 23 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

Anganwadi Strike: కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీల పిలుపు.. ఏపీలో ఉద్రిక్తం

విజయవాడ, జనవరి 3: సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు (బుధవారం) కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని గత 23 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మెలో భాగంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి అంగన్ వాడి వర్కర్స్ పిలుపునివ్వడంతో దాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.


  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో అంగన్ వాడీ వర్కర్స్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. దీంతో పోలీసుల తీరు పట్ల అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • ఏలూరు జిల్లాలో అంగన్ వాడీ కార్యకర్తల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏలూరులో తహశీల్దార్ సోమశేఖర్ 144 సెక్షన్ విధించారు. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు నిషేధాజ్ఞలు వర్తించనున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • కర్నూలు జిల్లాలో అంగన్వాడీలపై పోలీసుల ఉక్కు పాదం మోపుతున్నారు. జిల్లావ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడికి తరలివస్తున్న అంగన్వాడీలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పత్తికొండ, ఆలూరులో అంగన్వాడీలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌లకు తరలించారు.

  • ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అంగన్వాడీలు చలో విజయవాడ పిలుపుతో ఎక్కడెక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. జగ్గయ్యపేట, చిలకల్లు టోల్ ప్లాజా, పలుచోట్ల అంగన్వాడీలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు.

  • అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో కలెక్టరేట్ ముట్టడికి వెళ్లకుండా అంగన్వాడీ కార్యకర్తలకు పోలీసులు 41 ఏ నోటీసులు అందజేశారు.

  • కర్నూలు జిల్లాలో కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీగా పోలీసులు మోహరించారు.

  • అంగన్వాడి కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. అంగన్వాడీల కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

  • పశ్చిమగోదావరి జిల్లాలో అంగన్వాడీలు కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో భీమవరంలో ఎక్కడికక్కడ అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అంగన్వాడీలను భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు నిర్బంధించారు.

  • చిత్తూరు: కలెక్టరేట్ ముట్టడికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నుంచి భారీగా తరలివస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల ప్రయత్నాలను చేధించుకుని మరీ అంగన్వాడీలు కలెక్టరేట్‌కు చేరుకుంటున్నారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంగన్వాడీలకు మద్దతు తెలుపుతున్న సీఐటీయూ నాయకులను, అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 03 , 2024 | 11:03 AM