Share News

AP News: సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:03 PM

కడప జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా పులివెందులతో సహా కడప జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు వస్తున్నారు. కడప నగరంలో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, కడప ఇన్చార్జి మాధవిరెడ్డిల ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్నారు.

AP News: సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు

కడప జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా పులివెందులతో సహా కడప జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు వస్తున్నారు. కడప నగరంలో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, కడప ఇన్చార్జి మాధవిరెడ్డిల ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్నారు. టీడీపీలోకి పెరుగుతున్న వరుస వలసలు చూసి ఓర్వలేక నిన్న జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులపై దాడులు చేశారు.

కాగా కడప నగరం 24వ డివిజను రాజా రెడ్డివీధిలో మంగళవారం వెంకట అశోక్‌ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు భారీ ఎత్తున టీడీపీలో చేరారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి, కడప ఇన్‌చార్జి మాధవీరెడ్డి టీడీపీ కండువా కప్పి వారిని పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్య మంత్రి కావాలని మహిళలు యువత కోరుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో యువత ముందుండి అఖండ విజయమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఫలాలు అందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా ద్వారకనగర్‌ నుంచి యువత పెద్దఎత్తున బైకు ర్యాలీ ద్వారా రాజారెడ్డి వీధికి చేరుకుని శ్రీనివాసరెడ్డికి మాధవీరెడ్డిని ఘనంగా సత్కరించారు.

టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరుతో కల్లోలం సృష్టిస్తున్న వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రాభివృద్ధి ముందుకు కదల్లేదని ఆరో పించారు. మంగళవారం బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలోని సుజాత హాల్‌, రజక కాలనీ, చిన్నకొండారెడ్డి కాలనీ, వాసవి కాలనీ, జయమ్మ కాలనీలలో పర్యటించారు. బీటెక్‌ రవితో పాటు ఆయన సతీమణి లతారెడ్డి ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను వివరించారు. గతంలో చంద్ర బాబు హయాంలో చేసిన అభివృద్ధిని గుర్తుచేశారు. ఈ సందర్భంగా బీటెక్‌ రవి మాట్లాడుతూ పులివెందులలో రోజురోజుకు తెలుగుదేశంపార్టీకి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో టీడీపీకి ఆదరణ పెరుగుతుండడంతో జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు తమపై బురద జల్లడమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. టీడీపీలో చేరిన వారిని భయపెట్టి, భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని, దీని కారణంగానే టీడీపీలో చేరుతున్నారన్నారు. ముందుముందు మరిన్ని చేరికలు ఉంటాయని, బయటకు కనిపించని వారు కూడా టీడీపీకి ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. భవిష్యత్తు టీడీపీదే అని సంక్షేమం-అభివృద్ధి రెండు కళ్లలా భావించి పాలన అందించే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:11 PM